ఎవరు ఫస్ట్ …? ఎవరు బెస్ట్ …?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న రాజకీయానికి ట్విట్టర్ వేదికగా నిలిచింది. అధికార విపక్షాలు తమ అస్త్ర శాస్త్రాలను ట్విట్టర్ లో సంధించుకుని కలహించుకుంటున్నాయి. గంట గంటకు మారే [more]

Update: 2019-07-22 03:30 GMT

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న రాజకీయానికి ట్విట్టర్ వేదికగా నిలిచింది. అధికార విపక్షాలు తమ అస్త్ర శాస్త్రాలను ట్విట్టర్ లో సంధించుకుని కలహించుకుంటున్నాయి. గంట గంటకు మారే రాజకీయ పరిణామాలు, విమర్శలు, ఆరోపణలు ఇప్పుడు నెటిజెన్లకు పండగ మాదిరి కనిపిస్తుంది. ఏ నేత ఏమంటారు ? దానికి జవాబు ఎవరిస్తారు ఎలా ఇస్తారు అనేది రన్నింగ్ కామెంట్రీ తరహాలో ఆసక్తికరంగా అయిపొయింది. వాస్తవానికి ఒక నాయకుడు తమ ప్రత్యర్థిని విమర్శించాలంటే ప్రెస్ మీట్ పెట్టడం ఓపిక లేకపోతే ఒక ప్రెస్ నోట్ కానీ విడుదల చేసేవారు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక ఒక బైట్ ఇవ్వడం రివాజుగా ఉండేది. ఆ వార్త తరువాత రోజు వరకు వచ్చేది కాదు. టివి మీడియా లో వచ్చేందుకు ఒక పూట పట్టేది. దీనికి జవాబు ఇవ్వలిసిన వారు మరో రోజు తరువాత అదే విధానంలో స్పందించేవారు.

క్షణాల్లో వైరల్ …

కానీ సోషల్ మీడియా వచ్చాక క్షణాల్లో హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్, ఫెస్ బుక్, వాట్స్ అప్ ఇలా ఎందులో వచ్చినా అది హాట్ అనుకుంటే చాలు ఇట్టే ప్రపంచం చుట్టేస్తున్నాయి. ఇప్పుడు నేతలు కూడా యమా స్పీడ్ కోరుకుంటున్నారు. అందుకే వారు సామాజిక మాధ్యమాలు తమ అసలైన ప్రచార అస్త్రాలుగా గుర్తించి అందులో తమ వ్యక్తిగత ఖాతా ద్వారా ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా ఎపి లో ఈ ధోరణి ఇప్పుడు చాలావేగంగా నేతల్లో విస్తరించింది. గతంలో 2014 ముందు ప్రధాని మోడీ, కేజ్రీవాల్ వంటివారు సామాజిక మాధ్యమాల ద్వారానే హీరోలు అయిపోయారు. కానీ ఆ ధోరణి దక్షిణాదికి బాగా వ్యాప్తి చెందడానికి ఐదేళ్ళు పట్టింది.

తాజా రేసులో ఆయన టాప్ ….

ట్విట్టర్ రేసులో యమా స్పీడ్ లో వున్న వారిలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అందరికన్నా అగ్రస్థానంలో వున్నారు. విజయసాయి దూకుడు ముందు సొంత పార్టీలో వారు కానీ ప్రత్యర్థి పార్టీలో వున్న వారు కానీ ఆగలేకపోతున్నారు. ఆయన తరువాత స్థానం కోసం ప్రస్తుతం టిడిపి యువ నేత నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు సొంత పార్టీలోని కేశినేని నాని పోటీ వస్తున్నారు. నాని ఇటీవల సొంత పార్టీ లేదు, ప్రత్యర్థి పార్టీ లేదు అందరిపై సెటైర్లు విసిరేస్తూ ఉండటంతో క్రేజ్ ను సంపాదించారు. నాని ఎప్పుడు ఏ బాంబు పిలుస్తారా అన్న ఆసక్తి అన్ని పార్టీల్లో వ్యక్తం అవుతుంది.

చోటా మోటా నాయకులు….

ఇక ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ లపై నెటిజెన్స్ అంత ఆసక్తి ప్రదర్శించడంలేదు. ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జగన్ సైతం ఆ బాధ్యత విజయసాయి కే ఎక్కువ అప్పగించడంతో ఆయన గతంలోలా వేగంగా ట్వీట్స్ చేయడం లేదు. చంద్రబాబు సైతం లోకేష్ కే ట్విట్టర్ డ్యూటీ వేసేయడంతో టిడిపి భారాన్ని ప్రస్తుతం చినబాబే మోస్తున్నారు. రోజు రోజుకు ఎపి పొలిటికల్ లీడర్స్ సోషల్ మీడియా వార్ ట్విట్టర్ వేదికగా పెరుగుతూ ఉండటంతో చోటామోటా నాయకులు సైతం ఇదే రూట్ ను అనుసరించడం విశేషం. పైసా ఖర్చు ఉండదు క్షణం తీరికా ఉండని వ్యాపకం కావడంతో అందరు పావురం టపా నే ఎంచుకోవడం నేటి ట్రెండ్.

Tags:    

Similar News