జగన్ అభ్యర్థి పై బాబు టీం కి ముందే క్లారిటీ వచ్చేసిందా … ?

ఎన్నికల రణ క్షేత్రంలో ఏ పార్టీ అయినా సామ దాన దండోపాయాలను అన్ని వినియోగిస్తాయి. అధికారంలో ఉన్నవారికి ఈ విషయంలో ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. దాన్ని పూర్తి [more]

Update: 2021-04-19 08:00 GMT

ఎన్నికల రణ క్షేత్రంలో ఏ పార్టీ అయినా సామ దాన దండోపాయాలను అన్ని వినియోగిస్తాయి. అధికారంలో ఉన్నవారికి ఈ విషయంలో ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం రివాజుగా వస్తున్నదే. తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైసిపి దూకుడు కి విపక్షాలు విస్తుపోయేలా సాగింది. ఇది అంతా ముందే ఊహించిందే. ఐదు లక్షలకు పైగా మెజారిటీ టార్గెట్ గా వైసిపి మొదటి నుంచి ఒక లక్ష్యం నిర్దేశించుకుంది. దానికి అనుగుణంగానే అడుగులు వేసింది.

ప్రచారం హోరెత్తించినా ..

తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ తక్కువ చేయలేదు. టిడిపి అన్ని పార్టీలకన్నా ముందే ప్రచార భేరి మ్రోగించింది. బిజెపి – జనసేనలు దూసుకుపోయాయి. ఇక అధికార వైసిపి పక్కా వ్యూహంతో అడుగులు వేసింది. ఇలా అంతా ఎవరు చేయాలిసిన పని వారు చేసుకుపోయారు. చివరికి పోలింగ్ ఇలా మొదలైందో లేదో టిడిపి, దాని అనుకూల మీడియా లో దొంగఓట్లు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఉప ఎన్నిక తిరిగి నిర్వహించాలని కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే ఇదంతా సాగాలని తెలుగుదేశం స్లోగన్ అన్ని విపక్షాలు అందుకున్నాయి. ఈ ఎన్నిక మొదలు అవుతుందన్న సమయం నుంచి కూడా టిడిపి కేంద్ర బలగాల పర్యవేక్షణ డిమాండ్ నే చేస్తూ వచ్చింది. ఇప్పుడు దీనిని బలంగా జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది.

తేలిపోయిందా ..?

దాంతో ఇక తిరుపతి ఎన్నికల ఫలితం వైసిపికి ఏకపక్షం అన్నది తేటతెల్లం అయిపోయిందని నిపుణులు తేల్చేశారు. టిడిపి ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడైతే రాద్ధాంతం మొదలు పెట్టిందో వైసిపి మెజారిటీ రికార్డ్ స్థాయిలోనే ఉండబోతుందన్న సంకేతాలు వచ్చినట్లేనని చెబుతున్నారు. గతంలో టిడిపి హయాంలో నంద్యాల ఉప ఎన్నికల్లో ఆ పార్టీ చేసినవి మరిచిపోతే ఎలా అన్నది వైసిపి నేతలు ఎదురుదాడి మొదలు పెట్టారు. ఓటమి ఘోరంగా వుండబోతుందనే ఇదంతా అన్నది అధికారపార్టీ ప్రతిదాడి చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాల్చుతుండటంతో టిడిపి, బిజెపి జనసేన గగ్గోలు కానీ అధికారపార్టీ ప్రతి విమర్శలు ఆరోపణలకు జనంలో పెద్దగా ఆసక్తి లేకపోవడం విశేషం.

Tags:    

Similar News