ఎన్నికల వేళ ఇదేంది తంబీ?

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళుతున్నారు. నాయకత్వ లేమితో కొట్లాడుతున్న అన్నాడీఎంకే పళనిస్వామి, పన్నీర్ సెల్వంల నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనుంది. ఇంకా [more]

Update: 2020-08-30 16:30 GMT

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళుతున్నారు. నాయకత్వ లేమితో కొట్లాడుతున్న అన్నాడీఎంకే పళనిస్వామి, పన్నీర్ సెల్వంల నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనుంది. ఇంకా ఎనిమిది నెలల సమయంలోనే తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో రెండో రాజధాని డిమాండ్ ఊపందుకుంది. ఈ విషయంలో అన్నాడీఎంకే వర్గాలు రెండుగా విడిపోయాయి.

రెండో రాజధానిగా మధురైని…..

తమిళనాడులో ఇప్పుడు మధురై ని రాష్ట్ర రెండో రాజధానిగా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఎన్నికల సమయ కావడంతో ఈ డిమాండ్ కు మంచి ప్రాచుర్యం లభించింది. మధురైని రెండో రాజధానిగా చేయాలని పళనిస్వామి మంత్రివర్గంలోని సభ్యులు సెల్లూరు రాజు, ఉదయ్ కుమార్ లు ఏకంగా తీర్మానం చేశారు. మధురైను రెండో రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం వెంటనే చేేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తిరుచ్చిని చేయాలంటూ….

కాగా మరో మంత్రి నటరాజన్ తిరుచ్చిని రెండో రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ కూడా తిరుచ్చిని రెండో రాజధానిగా చేయాలని భావించేవారని నటరాజన్ గుర్తు చేస్తున్నారు. పైగా మధురై లో నీటి వసతి లేదని, రెండో రాజధానిగా ప్రకటిస్తే అక్కడ మరింత నీటి సమస్య ఎక్కువవుతుందని నటరాజన్ చెబుతున్నారు. దీనిపై త్వరలోనే అందరితో సమావేశమవుతానని ఆయన ప్రకటించారు.

డ్రామా అంటున్న డీఎంకే….

దీంతో పళనిసర్కార్ కొంత అయోమయంలో పడింది. అయితే మధురై ప్రాంతంలో అన్నాడీఎంకే పెద్దగా పట్టు లేకపోవడం వల్లనే ఇటువంటి డ్రామాలకు దిగిందన్నది డీఎంకే ఆరోపణ. ఎన్నికల సమయంలో మధురై ప్రాంతంలో తమను దెబ్బతీయడానికే రెండో రాజధాని అంశాన్ని తెరమీదకు తెచ్చారంటున్నారు. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల సమీపిస్తున్న సమయంలో రెండో రాజధాని అంశం కీలకంగా మారనుంది.

Tags:    

Similar News