అనుకున్నది సాధిస్తారా? ఆ సమయం ఎంతో దూరం లేదా?

ఒడిశాలో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటోంది. ఈ రాష్ట్రంపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. పాతుకుపోయిన నవీన్ పట్నాయక్ ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది. ఇప్పటి [more]

Update: 2020-09-14 17:30 GMT

ఒడిశాలో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటోంది. ఈ రాష్ట్రంపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. పాతుకుపోయిన నవీన్ పట్నాయక్ ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది. ఇప్పటి నుంచే బీజేపీ ఒడిశాలో మిషన్ 2024కు శ్రీకారం చుట్టింది. జిల్లాల వారీగా ప్రణాళికలను రచిస్తుంది. ఇప్పటికే బీజేపీ ఒడిశాలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీని ఒడిశాలో తీవ్రంగా నష్టపర్చడంలో బీజేపీ సక్సెస్ అయిందనే చెప్పాలి.

పదేళ్ల నుంచి ప్రత్యేక దృష్టి…..

పదేళ్ల నుంచి బీజేపీ ఒడిశాపై ప్రత్యేక దృష్టి పెట్టిందనే చెప్పాలి. అప్పటి వరకూ అక్కడ బిజూ జనతాదళ్, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోరు జరిగేది. అప్పటి వరకూ బీజేపీ అక్కడ ఊసులోనే లేదు. కానీ 2009 నుంచి బీజేపీ అక్కడ మిషన్ స్టార్ట్ చేసింది. ప్రధాన నేతలను ఆకర్షించగలిగింది. ఒడిశా రాష్ట్రానికి అనుగుణంగా తన ప్రణాళికలను రచించింది. 2014 నుంచి అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు పావులు కదిపారు.

బలం పెంచుకుంటూ…..

2014 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 18 శాతం ఓట్లు సాధించింది. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. అధికార పార్టీ కంటే రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ను దెబ్బతీయాలన్న లక్ష్యంతో బీజేపీ పనిచేసింది. కాంగ్రెస బలంగా ఉన్న ప్రాంతాల్లో పాగా వేసేందుకు గట్టి చర్యలే తీసుకుంది. అధికార పార్టీ, కాంగ్రెస్ నుంచి అనేక మంది నేతలను పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పేసింది. దీంతో క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నా… పైకి మాత్రం బీజేపీ బలంగా కన్పించింది.

మిషన్ 2024 ఫలిస్తుందా?

ఆ ఫలితాలు2019 ఎన్నికల్లో కన్పించాయి. ఎవరూ ఊహించని విధంగా 2019 ఎన్నికల్లో బీజేపీకి 32 శాతం ఓట్లు లభించాయి. దీంతో కాంగ్రెస్ ను నెట్టేసి రెండో స్థానంలోకి బీజేపీ ఎంటర్ అయింది. తదుపరి లక్ష్యం బిజూ జనతా దళ్ ను బలహీన పర్చడమే. నవీన్ పట్నాయక్ అనంతరం పార్టీని నడిపే నాయకత్వం లేకుండా చేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ముఖ్యమైన నేతలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంది. మొత్తం మీద ఒడిశాను ఎప్పటికైనా సొంతం చేసుకోవాలన్న బీజేపీ కల ఫలిస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.

Tags:    

Similar News