ఇక్కడా కూలపోయేటట్లుందిగా? రాహుల్ వల్లనేనా?

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. సొంత పార్టీ నేతలే అసమ్మతి కుంపటిని రాజేస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ జాబితాలో ఛత్తీస్ ఘడ్ కూడా [more]

Update: 2020-12-20 17:30 GMT

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. సొంత పార్టీ నేతలే అసమ్మతి కుంపటిని రాజేస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ జాబితాలో ఛత్తీస్ ఘడ్ కూడా చేరిపోయింది. గతంలో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో బీజేపీని కాలదన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్ ఇప్పటికే కాంగ్రెస్ చేజారిపోయింది. అక్కడ జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేయడంతో అధికారం కోల్పోవాల్సి వచ్చింది.

ఛత్తీష్ ఘడ్ లో అసమ్మతి కుంపటి….

ఇక రాజస్థాన్ లో మొన్నటి వరకూ సచిన్ పైలట్ అసంతృప్తి నేతగా మారారు. అది చల్లారిందనుకునేలోపు మళ్లీ ముసలం మొదలయింది. ఇక ఛత్తీస్ ఘడ్ లో సయితం కాంగ్రెస్ లో లుకలుకలు తప్పేట్లు లేదు. ఇక్కడ కాంగ్రెస్ లోని రెండు వర్గాలు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ను పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్ ఊపందుకుంది.

ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా….

ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్కడ ఫార్ములాను రూపొందించారు. ఫిఫ్టీ ఫార్ములాను రాహుల్ గాంధీయే దగ్గరుండి రూపొందించారు. తొలుత ముఖ్యమంత్రిగా భూపేశ్ బఘేల్ ను నియమించారు. రెండున్నర సంవత్సరాల తర్వాత ఆ పదవిని టీఎస్ సింగ్ కు ఇస్తామని ఒప్పందం కుదిరింది. అయితే 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ చెత్త ప్రదర్శన కనపర్చడంతో పార్టీ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు.

ముఖ్యమంత్రిగా తప్పుకోవాలని…..

దీంతో ఛత్తీస్ ఘడ్ లో రెండున్నరేళ్ల సీఎం పదవికి భూపేశ్ బఘేల్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న టీఎస్ సింగ్ తనను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకే తాను ఈ డిమాండ్ చేస్తున్నానని చెబుతున్నారు. అయితే భూపేశ్ బఘేల్ మాత్రం అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటానని చెబుతున్నారు. మొత్తం మీద ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది.

Tags:    

Similar News