ఇద్దరికీ చెక్ పెట్టేలా భారీ వ్యూహం ?

ఏపీలో బీజేపీ కొత్త తరహా వ్యూహానికి తెర తీస్తోంది. వైసీపీ బలం రాయలసీమ జిల్లాలతో పాటు, నెల్లూరు, ప్రకాశంలలో ఉంది. ఇక ఈ వైపునకు వస్తే ఉత్తరాంధ్రా [more]

Update: 2020-12-20 14:30 GMT

ఏపీలో బీజేపీ కొత్త తరహా వ్యూహానికి తెర తీస్తోంది. వైసీపీ బలం రాయలసీమ జిల్లాలతో పాటు, నెల్లూరు, ప్రకాశంలలో ఉంది. ఇక ఈ వైపునకు వస్తే ఉత్తరాంధ్రా కోస్తా జిల్లాల్లో టీడీపీ హల్ చల్ చేస్తూవస్తోంది. చంద్రబాబు జమానాలో రాయలసీమలో టీడీపీ గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. దాంతో చంద్రబాబు కూడా కోస్తా అల్లుడిగా తన వాటా ఇటేనని కన్ ఫర్మ్ చేసుకున్నారు. బాబు సామాజికవర్గానికి చెందిన వారంతా ఆయన్ని ఆదరించడంతో సీమ ఊసు మరచి మరీ ఇటే అభివృద్ధి అని కూడా అంటున్నారు. అలా బాబుకు 2014 ఎన్నికల్లో కోస్తా, ఉత్తరాంధ్రా కాసుకోవడంతో సీఎం అయిపోయారు.

ఇదే ప్లాన్….

ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీకి ఎక్కడ పట్టు ఉందో ఇప్పటిదాకా తెలియలేదు, తేలలేదు. కానీ కాస్తో కూస్తో బలం ఉంటే గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రా ముఖ ద్వారం విశాఖలో బీజేపీకి ఉందని గత విజయాలు రుజువు చేశాయి. వీటిని కాపాడుకుంటూనే కొత్త స్థానాల్లో బలపడాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. జగన్ కి పట్టున్న సీమ జిల్లాల్లో పాగా వేయడానికి చూస్తూనే టీడీపీకి చోటున్న కోస్తా ఉత్తరాంధ్రా జిల్లాల మీద కూడా బీజేపీ కన్ను వేసింది.

హిందూ కార్డు తో ….

సీమ జిల్లాలకు ముఖద్వారంగా చెప్పుకునే తిరుపతి నుంచే బీజేపీ రాజకీయ అజెండా అమలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇక్కడ హిందూ కార్డు వర్కౌట్ అవుతుందని బీజేపీ ఆలోచన. పైగా చిత్తూరు, కడప, కర్నూలు వంటి చోట్ల మైనారిటీలు పెద్ద ఎత్తున ఉన్నారు. అలాగే క్రిస్టియన్ మైనారిటీల హవా కూడా అనంతపురం కడప వంటి చోట్ల ఉంది. దాంతో హిందూ కార్డు తో అక్కడ బలంగా ఢీ కొడితే బలమైన రెడ్డి సామాజికవర్గంతో అమీ తుమీ తేల్చుకోవచ్చునని బీజేపీ భావిస్తోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఇపుడు బీజేపీకి బాగా కలసి వస్తోంది. అక్కడ ఊపు చూపిస్తే రాయలసీమలో పాతుకుపోవడానికి అదే తొలి మెట్టు అవుతుందని కూడా బీజేపీ ఆలోచిస్తోందిట.

కాపులూ, బీసీలే టార్గెట్ …..

ఇక గోదావరి జిల్లాల్లో కాపులను దరి చేర్చుకుంటూనే ఉత్తరాంధ్రాలో బీసీలను దువ్వడం ద్వారా టీడీపీ ఓటు బ్యాంక్ కి చిల్లు పెట్టడానికి బీజేపీ రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్రాలో పట్టున్న బీసీ నేతలను చేర్చుకోవడానికి బీజేపీ చూస్తోంది. మరో వైపు కృష్ణా, గుంటూరు లలో రాజకీయం మొత్తం అమరావతి రాజధాని మీదనే ఆధారపడి ఉంది. జగన్ ఎంతలా మూడు రాజధానులు అంటూ దూకుడు చేసినా అసలైన ట్రంప్ కార్డ్ బీజేపీ చేతిలోనే ఉంది. దాన్ని సమయానుకూలంగా వాడుకుంటే ఈ జిల్లాలు దాసోహం అంటాయన్నది బీజేపీ మరో ఎత్తుగడ. అలాగే, తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు అసాధ్యమైనా కనీసం రెండవ స్థానంలోకి వస్తే ఏపీలో కధ మొత్తం మార్చవచ్చునన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News