పట్టు సంపాదించలేక.. పనితీరు మెరగుపర్చుకోలేక?

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గాన్ని మరో ఏడాదిలో విస్తరించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు కసరత్తులు కూడా ప్రారంభించారు. కానీ అనేక మంది మంత్రులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తమ [more]

Update: 2020-10-25 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గాన్ని మరో ఏడాదిలో విస్తరించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు కసరత్తులు కూడా ప్రారంభించారు. కానీ అనేక మంది మంత్రులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తమ శాఖలో కూడా పట్టు సంపాదించుకోని మంత్రులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే ఈసారి మంత్రి వర్గ విస్తరణంలో ప్రస్తుతమున్న వారిలో నలుగురైదుగురు తప్పించి అందరినీ మార్చివేస్తారన్న ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది.

పనితీరు ప్రాతిపదికగా…

అవినీతి ఆరోపణలున్న మంత్రులతో పాటు పనితీరు బాగా లేని మంత్రులను తొలగించేందుకు జగన్ సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా కూడా జగన్ ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. జిల్లాలు, సామాజికవర్గాల ఆధారంగా ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటున్నారు. గత పదిహేడు నెలల్లో ఒకరిద్దరు మంత్రుల మీద తప్పించి ఎవరిపై అవినీతి ఆరోపణలు రాలేదు.

కొందరికి మాత్రం….?

కార్మిక శాఖమంత్రి గుమ్మనూరి జయరాంపైనే ఇప్పటి వరకూ ఆరోపణలు వచ్చాయి. అది కూడా విపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. దీంతో గుమ్మనూరి జయరాంకు ఉద్వాసన తప్పదు. అలాగే పనితీరు బాగాలేని మంత్రుల్లో తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారు. వీరిద్దరూ తమ శాఖను పట్టించుకోకపోవడమే కాకుండా, పార్టీ విషయాలను కూడా పక్కనపెట్టారని అధిష్టానం గుర్తించింది.

కరోనా కారణంగానేనంటూ….

అలాగే ఇక కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన మంత్రుల పనితీరుపైన కూడా వైసీపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఒకరు, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లాలకు చెందిన మంత్రులకు కూడా వచ్చే విస్తరణలో పక్కన పెట్టే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఉన్న మంత్రులకు ఇప్పుడు విస్తరణ భయం పట్టుకుంది. సగం కాలం కరోనాతో పోవడంతో తమ పనితీరును చూపించేలకపోయామని కొందరు వివరణ ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు.

Tags:    

Similar News