Andhra : ఎవరూ తక్కువ తినలేదు…అందుకే ఇంత రచ్చ

ఆంధ్రప్రదేశ్ మరో తమిళనాడులా మారిపోయింది. గతంలో జయలలిత, కరుణానిధి జీవించి ఉన్నప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఏపీలోనూ అలానే ఉన్నాయి. టీడీపీ, వైసీపీల మధ్య రోజుకో [more]

Update: 2021-10-20 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ మరో తమిళనాడులా మారిపోయింది. గతంలో జయలలిత, కరుణానిధి జీవించి ఉన్నప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఏపీలోనూ అలానే ఉన్నాయి. టీడీపీ, వైసీపీల మధ్య రోజుకో రచ్చ జరుగుతుంది. అసలు సమస్యలు పక్కకు వెళ్లిపోయి వేస్ట్ విషయాలు హైలెట్ అవుతున్నాయి. చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ రాజకీయాల రూటును మార్చివేశారు. బండ బూతులు, హింసలను ఇద్దరూ ప్రోత్సహిస్తున్నారు.

బాబు చేసిందేమిటి?

నిజానికి పట్టాభి ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తూ పార్టీ తరుపున క్షమాపణ చెప్పాలి. కానీ చంద్రబాబు అది చేయకపోగా వైసీపీ నేతలు తమను ఎన్ని మాటలు అన్నారని ఎదురు ప్రశ్నించడంతో పార్టీ నేతల నోళ్లకు ఆయన లైసెన్స్ ఇచ్చినట్లయింది. సభ్యసమాజం తలదించుకునే విధంగా ఒక ముఖ్యమంత్రిని తూలనాడటం ఎంతవరకూ సబబని చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోలేకపోయారు.

జగన్ మౌనం వెనక?

ఇక జగన్ కూడా ఎవరో అడ్రస్ లేని వ్యక్తులు దూషించారని ఏకంగా ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగడం సరికాదు. ప్రజాస్వామ్యంలో ఎన్ని విమర్శలు చేసినా దానిని చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొన వచ్చు. పట్టాభి చేసిన వ్యాఖ్యలకు ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయవచ్చు. కానీ అధికారంలో ఉన్న పార్టీ వీరంగం సృష్టించడం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల పరిస్థితిని చెప్పకనే చెబుతుంది.

పోలీసులను అని ప్రయోజనమేంటి?

రెండు పార్టీలు సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఇటు జగన్ అటు చంద్రబాబు పట్టుదలకు పోతే ప్రజలు శాంతియుతంగా జీవించలేరు. అధికార ప్రతినిధులుగా నియమించేవారికి పార్టీలు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటే మంచిది. వారికి కొంత సభ్యత నేర్పితే మంచిది. లేకుంటే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. దానికి పోలీసులను ప్రశ్నించి ప్రయోజనం లేదు. ముందుగా రాజకీయ పార్టీలు తమను తాము సంస్కరించుకుంటే మంచిది.

Tags:    

Similar News