సేఫ్ గా ఉన్నామనుకుంటే కుదరదు.. అదిగో ప్రమాదం?

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆ రెండు జిల్లాల పేరు మార్మోగిపోతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆ జిల్లాలోకి ప్రవేశించక పోవడమే ఆ జిల్లాల పేర్లను ప్రచారం [more]

Update: 2020-04-13 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆ రెండు జిల్లాల పేరు మార్మోగిపోతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆ జిల్లాలోకి ప్రవేశించక పోవడమే ఆ జిల్లాల పేర్లను ప్రచారం లో నిలిపింది. ఆ జిల్లాలే ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం కావడం విశేషం. పక్కనే ఉన్న విశాఖ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా సర్కార్ తీసుకుంటున్న చర్యలు నేపథ్యంలో వైరస్ పాజిటివ్ వ్యక్తులు అక్కడ సంచరించే ఛాన్స్ లేకుండా పోవడంతో అక్కడి ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రతిరోజూ ఏపీ లో వివిధ జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నా ఉత్తరాంధ్ర లోని ఆ రెండు మాత్రం ఇప్పటివరకు సేఫ్ గానే ఉండటం అదృష్టమని చెప్పొచ్చు.

పొంచి వున్న ప్రమాదం …

ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని వారు ఎక్కువ శాతం పేదరికంలో వుండేవారే. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచే వలస కార్మికులు అత్యధికంగా బతుకు బండి సాగక వెళుతుంటారు. అయితే కూలీ నాలి పనులకు వెళ్లిరావడం తప్ప విదేశాలకు వెళ్లివచ్చే వారి సంఖ్య ఇక్కడ తక్కువే. అదేవిధంగా మర్కజ్ సభలకు ఢిల్లీ వెళ్లి కొందరు వచ్చినా వారికి టెస్ట్ లలో నెగిటివ్ రావడంతో ఇబ్బంది లేకుండా పోయింది.

ఛత్తీస్ ఘడ్ లో…..

అయితే ఈ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్ ఘడ్ లో కరోనా విజృంభణ మొదలైంది. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దుల వద్ద మరింత అప్రమత్తంగా ఎపి పోలీసులు పనిచేయాలిసి ఉంది. వైరస్ తగ్గుముఖం పట్టేవరకు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిరావడాన్ని కొంతకాలం వీరు కట్టడి చేసుకోవాలి. ఇలా స్వీయ నియంత్రణ చర్యలు చేసుకుంటే మాత్రం కరోనా కరాళ నృత్యంలో ఎపి లో ఈ రెండు నిల్ కేసులతో ఒక రికార్డ్ నమోదు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి

Tags:    

Similar News