అందుకే వారిని దూరం పెట్టారా?

అసలే వారిని పట్టించుకోరు. ఆపై వారి వద్ద నిధులు కూడా లేవు. దీంతో వారిని పూర్తిగా పక్కన పెట్టేసినట్లే కన్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు సభ్యులకు ఇటు [more]

Update: 2020-11-16 03:30 GMT

అసలే వారిని పట్టించుకోరు. ఆపై వారి వద్ద నిధులు కూడా లేవు. దీంతో వారిని పూర్తిగా పక్కన పెట్టేసినట్లే కన్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు సభ్యులకు ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వ పరంగానూ పెద్దగా ప్రాధాన్యత కన్పించడం లేదు. అసలు ఎంపీ ఒకరు ఉన్నారన్న ధ్యాస కూడా ఎమ్మెల్యేల్లో లేకపోవడం విశేషం. దీనికి అనేక కారణాలున్నాయి. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో గ్రూపులు మెయిన్ టెయిన్ చేస్తారన్నది ఒక కారణం.

ఈ ఏడాది నిధులకు బ్రేక్……

మరో ప్రధాన కారణం ఈ ఏడాది ఎంపీ ల్యాడ్స్ నిధులు లేకపోవడమే. పార్లమెంటు సభ్యులకు ప్రతి ఏడాది ఐదు కోట్ల వరకూ కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది. వారు తమ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏ అభివృద్ధి పనికైనా నిధులు కేటాయించే అవకాశముంది. దీంతో గతంలో నిధుల కోసం ఎమ్మెల్యేలు ఎంపీల వద్దకు క్యూ కట్టేవారు. అభివృద్ధి పనులకు వారిచేతనే శంకుస్థాపన చేయించేవారు.

అందుకే పట్టించుకోవడం లేదని……

కానీ కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఎంపీ ల్యాడ్స్ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఎంపీలకు ఈ ఏడాది ప్రత్యేకంగా వచ్చే నిధులేమీ లేవు. అందుకే పార్లమెంటు సభ్యులను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదంటున్నారు. తమ నియోజకవర్గం పరిధిలో జరిగే కార్యక్రమాలకు కూడా వారికి ఆహ్వానం పంపడం లేదు. వారి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా నష్టమే ఎక్కువగా ఉందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.

గ్యాప్ బాగా పెరిగింది…..

అందుకే దాదాపు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగింది. అయితే ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాది అయినా ఎంపీ ల్యాడ్స్ నిధులు వారికి వస్తాయి. అప్పుడైనా నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని వారి వెంట పడాల్సి ఉంటుంది. అందుకే ఎంపీలు సయితం ఎమ్మెల్యేలు తమ వద్దకు వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని సహనంతో ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద నిధుల లేకపోవడం వల్లనే ఎంపీలను ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా వారికి ప్రాధాన్యత దక్కడం లేద.

Tags:    

Similar News