బడా బాబులు.. ఓ బంకరు.. కరోనాతో అలెర్ట్

బంకర్లు. . . వీటి గురించి మనం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం. సరిహద్దుల్లో శత్రుదేశాల దాడుల నుంచి రక్షణ పొందేందుకు సైనికులు, [more]

Update: 2020-05-31 17:30 GMT

బంకర్లు. . . వీటి గురించి మనం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం. సరిహద్దుల్లో శత్రుదేశాల దాడుల నుంచి రక్షణ పొందేందుకు సైనికులు, స్ధానికులు వీటిని వాడుతుంటారు. మనదేశానికి పాకిస్ధాన్ సరిహద్దులో జమ్ముకాశ్మీర్, పంజాబ్ సరిహద్దులో ఇవి ఉన్నాయి. ఈశాన్యంలో ఇతర సరిహద్దుల్లో బంకర్లు లేవు. ఇజ్రాయెల్ లాంటి సమస్యాత్మక దేశాలు తమదేశాల సరిహద్దులో పెద్దఎత్తున బంకర్లను నిర్మించాయి. నిత్యం ఈ దేశం ఇరుగు పొరుగుదేశాలతో కయ్యానికి కాలుదువ్వుతుంటోంది. ఒకప్పటి బంకర్లు కరోనా పుణ్యమా అని ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కరోనా సోకకుండా తమను తాము కాపాడు కునేందుకు బడాబాబులు, సంపన్నుల ఇప్పుడు బంకర్లను ఆశ్రయిస్లున్నారు.

న్యూజిల్యాండ్ వెళ్లి…..

ఇదో కొత్తరకం ఆలోచన ప్రక్రియ. అమెరికాకు చెందిన బిలినియర్లు న్యూజిలాండ్ లోని బంకర్లను కొనుగోలు చేస్తున్నారు. వాటిల్లో తలదాచు కునేందుకు ఆసక్తి చుాపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అగ్రరాజ్యంలోనే కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దీంతో వేరే మార్గం లేక, గత్యంతరం లేక అమెరికాలోని సంపన్నులు న్యూజిలాండ్ లోని బంకర్ల బాట పట్టడం సరికొత్త పరిణామం. న్యూజిలాండ్ లో నిర్మిస్తున్న బంకర్లు సాదాసీదావి కావు వీటిల్లో సకల సౌకర్యాలు ఉంటాయి. విశాలంగా, విలాసవంతంగా ఉంటాయి. అక్కడలేని సౌకర్యాలు, వసతి అంటూ ఏమీ ఉండదు. అదేస మయంలో వాటి ఖరాదు కూడా చుక్కలను తాకుతుంది. బడాబాబులు తప్ప సాధారణ పౌరులు వాటిచుట్టుపక్కలకు వెళ్ళేంత పరిస్ధితి కూడా ఉండదు. కోట్ల రుాపాయల్లో ఉంటుంది.

ఖరీదైన వ్యవహారమే….

ఆర్ధికంగా ఓ మోస్తరు దేశమైన న్యూజిలాండ్ జనాభా, 50 లక్షలలోనే. ఐరోపా ఖండంలోని ఈ దేశ ప్రజలు ఆర్ధిక పరిస్ధితులు కూడా అంతగొప్పగా లేవు. దీంతో సంపన్నులు, ముఖ్యంగా అమెరికన్లను దృష్టిలో పెట్టుకుని బంకర్లను నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్ లోని రైసింగ్ ఎన్ కో అనే సంస్ధ బంకర్ల నిర్మాణాల్లో నిమగ్నమైంది. భుామికి 11 అడుగుల దిగువన వీటిని ఆ సంస్ధ నిర్మిస్తోంది. ఇటీవల ఈ సంస్ధ 11 బంకర్లను నిర్మించింది. ఒక్కో బంకరులో 22 మంది వరకు ఉండవచ్చు. వీటిల్లో మాస్టర్ బెడ్ రుామ్, లివింగ్ రుామ్, డైనింగ్ హాల్, కిచెన్, ఫిట్ నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్ వంటి అధునాతన సౌకర్యాలు ఉంటాయి. కొన్ని చోట్ల రెండు, మూడు అంతస్ధుల్లో బంకర్లు నిర్మించారు. వీటికి నిరంతరాయంగా ఆక్సిజన్, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొద్ది కాలానికి సరిపడా అవసరమైన ఆహార పదార్ధాలు కూడా ఈ బంకర్లలో నిల్వ ఉంచుతున్నారు. మరికొన్ని బంకర్ల లో ఇతర అధునాతన సౌకర్యాలు కూడా ఉన్నాయి. వాటర్ ఫాల్, మూవీ ధియేటర్, గార్డెన్లు, చేపలు పెంచుకొనే కొలనులు కుాడా ఉన్నాయి. అదే సమయంలో వీటికి 24 గంటలు భద్రత సౌకర్యాన్ని సైతం కల్పిస్తున్నారు. అంటే సంపన్నులు నిర్భయంగా, నిశ్చింతగా ముాడునెలల నుంచి ముాడేళ్ళ వరకు ఇక్కడ గడిపేందుకు అవకాశం ఉంది.

ఎక్కువగా అమెరికన్ లే…..

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సంపన్నులు ఉన్నప్పటికీ ఒక్క అమెరికన్లు మాత్రమే ఈ బంకర్ల పట్ల ఆశక్తి చుాపుతున్నారు. ముఖ్యంగా సిలికాన్ వ్యాలి వాసులు బంకర్లను కొనేందుకు ముందుకు వస్తున్నారు. వైకాంబినేటర్ స్టార్టప్ ప్రెసిడెంట్ శ్యామ్, అల్టమన్ గతంలో ఓ బంకరును కొన్నారు. పేసాల్ కో ఫౌండర్, ఫేస్ బుక్ బిలీనియర్ పీటర్ ధయెాల్, టెక్సాస్ బ్లుామ్ బర్గ్ కంపెనీ జనరల్ మేనేజర్ కోట్ల రుాపాయలు వెచ్చించి న్యూజిలాండ్ లోని కీవర్స్ టౌన్ లో ఓ అధునాతన బంకర్లను సొంతం చేసుకున్నారు. హాటర్ లోని లగ్జరీ సూట్ లాంటి బంకర్ విలువ దాదాపు 3 కోట్ల రూపాయలు ఉంటుంది. అంతకు మించి సౌకర్యాలు కావాలంటే దాదాపు రుా.20 కోట్లకు పైగా వెచ్చించాల్సి ఉంటుంది. అమెరికన్లను చుాసి సౌదీ అరేబియా తదితర దేశాల సంపన్నులు సైతం న్యూజిలాండ్ బాట పడుతున్నారు. మెుత్తం మీద ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదని బడాబాబులు నిరూపిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News