Imran : ఇద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదుగా?

ఏదైనా భరించడం కొన్ని రోజులే. అసహనం కట్టలు తెంచుకుంటే ప్రజలు రోడ్ల మీదకు వస్తారు. పైసా ఆదాయం లేకపోగా, ఉన్నవి ఊడ్చుకుపోతున్న ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడతారు. దీనికి [more]

Update: 2021-10-27 16:30 GMT

ఏదైనా భరించడం కొన్ని రోజులే. అసహనం కట్టలు తెంచుకుంటే ప్రజలు రోడ్ల మీదకు వస్తారు. పైసా ఆదాయం లేకపోగా, ఉన్నవి ఊడ్చుకుపోతున్న ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడతారు. దీనికి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక ఉదాహరణ. పాకిస్థాన్ ప్రజల్లో ఇప్పుుడు తీవ్ర వ్యతిరేకత కన్పిస్తుంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ధరలను నియంత్రించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు.

పాక్ లో మిన్నంటిన నిరసనలు….

పాకిస్థాన్ లో పేదరికం ఎక్కువ. మన భారత్ లాగే. ఉపాధి అవకాశాలు కూడా తక్కువే. పేద, మధ్య తరతి ప్రజలే ఎక్కువ. గత కొన్ని రోజుల నుంచి పెట్రోలు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. లీటరు పెట్రోలు ధర 135 రూపాయలకు చేరుకుంది. గ్యాస్ సిలెండర్ ధర 2,300 దాటింది. కమర్షియల్ సిలిండర్ ధర 9వేలకు చేరుకుంది. దీంతో నిత్యావసరవస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

గద్దె దిగాల్సిందేనంటూ….

ఎంతవరకూ అంటే పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగాల్సిందేనంటున్నారు. దీంతో పాకిస్థాన్ లో అశాంతి నెలకొంది. పాకిస్థాన్ కు మన దేశ పరిస్థితులు భిన్నంగా ఏమీ లేవు. కరోనా కారణంగానే ఆర్థిక పరిస్థిితి దెబ్బతిని ఉండవచ్చు. కానీ ప్రజల జీవన పరిస్థితిని పాలకులు పరిగణనలోకి తీసుకోవాలి. కానీ భారత్ ప్రజలు శాంతియుతంగా ఉన్నారు. అంతే తేడా. భారత్ లో కూడా నిత్యావసరవస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోలు ధరలు కూడా పాక్ చెంతకు త్వరలోనే చేరుకోనున్నాయి. గ్యాస్ సిలెండర్ ధర కూడా వెయ్యికి చేరుకుంది. పాక్ కు, భారత్ కు ప్రస్తుతం పాలనలో పెద్దగా తేడా ఏమీ లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

ఎన్నికల సమయంలో…

పాక్ లో కొంత దూకుడు స్వభావం ఉన్న ప్రజలు కావడంతో వెనువెంటనే రోడ్ల మీదకు వచ్చారు. కానీ భారత్ లో శాంతిని కోరుకునే వారు ఎక్కువ మంది. వారు రోడ్డు మీదకు రాకపోయినా వారి మనసులోనూ అదే ఉందన్న విషయాన్ని ఇక్కడ పాలకులు గుర్తుంచుకోవాలి. చూసి చూసి ఇక్కడ కూడా ప్రజలు తమ ఓటు ద్వారా ఎన్నికల సమయంలో తిరగబడే అవకాశాలుంటాయని తెలుసుకుంటే మంచిదన్న సూచనలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద పాక్ లో జరుగుతున్న పరిణామాలు భారత్ పాలకుల్లో కూడా కలవరం రేపుతున్నాయనే చెప్పాలి.

Tags:    

Similar News