ఎంతకాలం ఆంధ్రులను బూచిగా చూపుతారు?

ఉమ్మడి ఏపీ రెండుగా మారింది. విభజన కష్టాలతో ఏపీ రావణ కాష్టంగా ఇప్పటికీ రగులుతూనే ఉంది. మరో వైపు అద్భుతమైన ఆర్ధిక వనరులు కలిగిన హైదరాబాద్ రాజధానిగా [more]

Update: 2021-03-01 00:30 GMT

ఉమ్మడి ఏపీ రెండుగా మారింది. విభజన కష్టాలతో ఏపీ రావణ కాష్టంగా ఇప్పటికీ రగులుతూనే ఉంది. మరో వైపు అద్భుతమైన ఆర్ధిక వనరులు కలిగిన హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణా ప్రగతి గతిన ముందుకు సాగుతోంది. సరే విడిపోయాక ఎవరి బాధలు వారివి, కానీ తెలుగువారు అంతా ఒక్కటేగా. అంతా సోదరులేగా. నిన్నటిదాకా కలసే ఉన్నారుగా. ఆ సోయి మరచిపోయి టీయారెస్ మంత్రి గంగుల కమలాకర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సాటి తెలుగువారు అయిన ఆంధ్రులకు మంట పుట్టించేలా ఉన్నాయి.

ఈ గిల్లుడేంది గంగులా..:

ఏపీలో పదమూడు జిల్లాల రాష్ట్రం పడుతూ లేస్తూ సాగుతోంది. అంతా కలసి ఉన్న చోటనే ఇంకా ఏదీ అభివృద్ధి లేదు. ఇపుడు ఆ ఏపీలో కొత్త చిచ్చు రగిల్చేలా మంత్రి గంగుల కమలాకర్ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. వైఎస్సార్ తనయ షర్మిల ఇంకా పార్టీ పెట్టలేదు. పెట్టినా కూడా తప్పు లేదు. ఆమె పార్టీ రాజకీయ విధానాల మీద ఎవరైనా విమర్శలు కూడా చేయవచ్చు. కానీ అవన్నీ వదిలేసి ఇక్కడ పార్టీ పెట్టకూడదు, అవసరం అయితే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడూ అంటూ గంగుల షర్మిలకు ఉచిత సలహాలు ఇవ్వడం బాధ్యతారాహిత్యమే అంటునారు.

ఎన్ని ముక్కలు కావాలి..?

ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు ఢిల్లీలో బలం వేరు, ఆ గౌరవం వేరు. ఇపుడు విభజన జరిగిన తరువాత ఎవరూ తలెత్తుకోలేని పరిస్థితి. 42 ఎంపీలు ఉన్న ఉమ్మడి ఏపీ కాస్తా అటు పాతిక, ఇటు పదిహేడుగా విడిపోయింది. ఇక పొరుగున ఉన్న కర్నాటకకు 28 ఎంపీలు, ఉంటే తమిళనాడుకు 39 మంది ఉన్నారు. అందరి కంటే కూడా వెనకబడి అభివృద్ధి విషయంలోనూ బ్యాక్ బెంచ్ కి పోతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి కేంద్రం చిన్న చూపు వీటన్నిటి కంటే అతి పెద్ద సమస్య. ఈ నేపధ్యంలో ప్రత్యేక రాష్ట్రాల పేరిట కొత్త వివాదాలు రేపాలనుకోవడం ఎంతవరకూ సమంజసం, ఇప్పటికే అన్ని రకాలుగా కునారిల్లి ఉన్న చోట విభజన విషాలను నాటితే అది ఎంతవరకూ మంచిది అన్నది కూడా చూడాలి. అయినా ఆంధ్ర రాష్ట్రం సాధక బాధకాలు తెలంగాణా మంత్రికి ఎందుకు అన్నదే ఇక్కడ మేధావుల నుంచి వస్తున్న మరో ప్రశ్న.

అదే బూచిగానా….?

ఎంతకాలం ఆంధ్రులను బూచిగా చూపిస్తారు, ఆంధ్రులు దోచుకున్నారు అంటూ జనాలను మభ్యపెడతారు అన్న మాట కూడా తెలంగాణా సమాజం నుంచి వస్తోంది. దోపిడీదారుడికి ప్రాంతం, వర్గం, వర్ణం ప్రత్యేకంగా ఉంటుందా. ఆంధ్రా బూచి చూపించి గెలవాలనుకోవడమే దిగజారుడు రాజకీయమని కూడా అంటున్నారు. 2018 ఎన్నికల వేళ చంద్రబాబు తెలంగాణాలో పెత్తనం చేయాలనుకుంటున్నాడు అని ప్రచారం చేసి ఎన్నికల్లో గెల్చిన వారు ఇపుడు షర్మిలను ఆంధ్రా పార్టీ అంటూ ఇంకా పుట్టని పార్టీ మీద నిందలు వేయడం కూడా తగదన్న మాట ఉంది.

Tags:    

Similar News