రాజ‌కీయంగా జ‌గ‌న్ ఇరుక్కుపోయాడా ?

విలువ‌లు లేని రాజ‌కీయం తాను చేయ‌బోన‌ని అసెంబ్లీ సాక్షిగా ఇటీవ‌లే చెప్పిన ఆయ‌నకు ఇప్పుడు బీజేపీ రూపంలో అగ్ని ప‌రీక్ష ఎదురైంది. తాజాగా బీజేపీ తిప్పుతున్న‌చ‌క్రంతో ఒక‌ప‌క్క [more]

Update: 2019-06-22 18:29 GMT

విలువ‌లు లేని రాజ‌కీయం తాను చేయ‌బోన‌ని అసెంబ్లీ సాక్షిగా ఇటీవ‌లే చెప్పిన ఆయ‌నకు ఇప్పుడు బీజేపీ రూపంలో అగ్ని ప‌రీక్ష ఎదురైంది. తాజాగా బీజేపీ తిప్పుతున్న‌చ‌క్రంతో ఒక‌ప‌క్క టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌రిస్థితి చింద‌ర‌వంద‌ర‌గా మారిపోయింది. న‌లుగురు ఎంపీలు, ఎమ్మెల్సీల ప‌రిస్థితి తెర‌మీదికి రానుంది. అయితే, ఎమ్మెల్సీలను ప‌క్క‌న పెడితే.. ఎమ్మెల్యేల విష‌యం మాత్రం అటు చంద్ర‌బాబుకు ఎంత ఇబ్బందిక‌ర‌మో.. అంత‌క‌న్నా కూడా జగన్ మోహన్ రెడ్డి కి ఇప్పుడు రాజ‌కీయంగా ఇబ్బంది ఖాయం.

రేపు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ మారి.. బీజేపీ కండువా క‌ప్పుకొని అసెంబ్లీలోకి అడుగు పెట్టార‌ని అనుకుందాం. అప్పుడు ఏం జ‌రుగుతుంది? నిజానికి ఇటీవ‌ల జ‌రిగిన తొలి అసెంబ్లీ స‌మావేశాల్లో వైసీపీ అధినేత‌, సీఎం, స‌భానాయ‌కుడి హోదాలో జగన్ మోహన్ రెడ్డి కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. అసెంబ్లీ తీరుతెన్నులు మారుస్తాన‌ని, ఫిరాయింపుల‌ను తాను ఎట్టిప‌రిస్థితిలోనూ ప్రోత్స‌హించ‌బోన‌ని ఆయ‌న ఖ‌రాఖండీగా చెప్పారు. అంతేకాదు. ఒక‌వేళ ఎవ‌రైనా టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారి వైసీపీ తీర్థం పుచ్చుకోవాల‌ని భావిస్తే.. ఖ‌చ్చితంగా ఆయా స‌భ్యులు త‌మ ప‌ద‌వుల‌కు, పార్టీ స‌భ్య‌త్వాల‌కు రాజీనామా చేసి రావాల్సిందేన‌ని చెప్పుకొచ్చారు.

జగన్ మోహన్ రెడ్డి గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ఇదే అంశంపై ఏపీలో పోరాటం చేశారు. త‌మ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు సంతలో ప‌శువుల‌ను కొన్న‌ట్టు కొన్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. జ‌గ‌న్ చేసిన ఈ పోరాటానికి ప్ర‌జ‌ల నుంచి కూడా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల‌ను త‌న పార్టీలోకి ప్రోత్స‌హించ‌క‌పోయినా టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళితే స‌భానాయ‌కుడిగా ఏం చేస్తారు ? అన్న‌ది చూడాలి.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌ని ప‌క్షంలో స‌భాప‌తి గా ఉన్న స్పీక‌ర్ త‌నకు ఉన్న పూర్తి అధికారాల‌ను స‌ద్వినియోగం చేసుకుని ఫిరాయించిన నేత‌ల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌డంతోపాటు స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని, స‌భ హుందాత‌నాన్ని కాపాడాల‌ని దాదాపు గంట‌కు పైగా జగన్ మోహన్ రెడ్డి ప్ర‌సంగించారు. అంటే బ‌హుశ‌.. టీడీపీ నాయ‌కులు బీజేపీ వైపు చూస్తార‌ని జ‌గ‌న్ ఆ సమ‌యంలో ఊహించి ఉండ‌రు.

కానీ, ఇప్పుడు టీడీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయ‌కులు జ‌గ‌న్‌ను ప‌క్క‌కు పెట్టి.. నేరుగా వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకుని రేపు అసెంబ్లీకి వ‌స్తే..వీరిపై జగన్ మోహన్ రెడ్డి చెప్పిన‌ట్టు వేటు వేయాలి..! మ‌రి ఈ సాహ‌సం జ‌గ‌న్ ఇప్పుడు స్పీక‌ర్ ద్వారా చేయించ‌గ‌ల‌రా? అనేదిమిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. వేటు వేస్తే.. కేంద్రంలోని బీజేపీ జ‌గ‌న్‌కు స‌హ‌క‌రిస్తుందా? అంటే.. ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హ‌క‌రించ‌క‌పోగా.. జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టే ప‌రిస్థితి కూడా రావ‌చ్చు. సో.. మొత్తానికి జ‌గ‌న్‌ను బీజేపీ ఇరికించేసింద‌నే చెప్పాలి.

Tags:    

Similar News