విపక్షాలకు ఈ రాజకీయం మంచిదేనా..?

అన్ని చుక్కలు ఒక వైపు, నిండు చందురుడు మరో వైపు అని ఒక టాలీవుడ్ స్టార్ సినిమాలో పాపులర్ సాంగ్ ఉంది. ఏపీ రాజకీయాల్లో ఇపుడు చూస్తే [more]

Update: 2021-01-07 14:30 GMT

అన్ని చుక్కలు ఒక వైపు, నిండు చందురుడు మరో వైపు అని ఒక టాలీవుడ్ స్టార్ సినిమాలో పాపులర్ సాంగ్ ఉంది. ఏపీ రాజకీయాల్లో ఇపుడు చూస్తే అదే కనిపిస్తోంది. జగన్ ఒక వైపు ఉంటే విపక్షాలు అన్నీ కూడా కుడి ఎడమల తేడా మరచి గుంపుగానే ఉంటున్నాయి. సీపీఐ నారాయణ అయినా బీజేపీ సోము వీర్రాజు అయినా జగన్ దగ్గరకు వచ్చేసరికి ఒకేలా సౌండ్ చేస్తున్నారు. జనసేనాని పవన్ అయినా, చంద్రబాబు అయినా కూడా జగన్ మీద బాణాలు వేయడంలో ముందుంటున్నారు. మరి ఇది విపక్షాల రాజకీయానికి ఏ మాత్రం మేలు చేస్తుంది అన్న చర్చ అయితే ఉంది.

సెంటు జాగా అంటే …

ఏపీలో జగన్ సెంటు జాగా మాత్రమే పేదలకు ఇస్తున్నారు అంటూ టీడీపీ భావి నేత లోకేష్ అంటున్నారు. జగన్ ఇంటి బాత్ రూం సాటి కూడా చేయని స్థలంలో ఇళ్ళు కట్టిస్తున్నారని హాట్ కామెంట్స్ కూడా చినబాబు చేస్తున్నారు. ఇది నిజంగా కడుపు మంటతో చేసిన కామెంట్ అని వైసీపీ మాత్రమే కాదు రాజ‌కీయాల మీద ఆ మాత్రం అవగాహన ఉన్నవారు అంతా అంటున్నారు. ఈ దేశంలో నూటికి ఎనభై శాతం మంది జీవిస్తోందే సెంట్ జాగా స్థలంలో. పైగా అద్దెల భారంతో బతుకులు దీనంగా ఈడుస్తున్నారు అటువంటి వారికి ఇల్లు కట్టించి ఇవ్వడం అంటే గొప్పగానే చూడాలి కదా. అయినా సెంట్ జాగా అంటే అంత లోకువా హీనం ఎందుకవుతోంది. భూమి రేటు పెరిగిన కొద్దీ అది కూడా అమాంతం పెరుగుతుంది అన్నది తెలియదా అన్న చర్చ కూడా ఉంది.

ఈయన అంతేగా…?

పేదల పక్షం వహించే వామపక్షాలు కూదా ఇపుడు పంధా మార్చుకుంటున్నాయి. ఇళ్ళు పేదలకు ఇవ్వలేదని గోల పెట్టే వారు తీరా ఇళ్ళ పట్టాలు పెద్ద ఎత్తున పంపిణీ చేస్తూంటే వంకలు పెట్టడం ఫక్త్ రాజకీయమే అవుతుంది అంటున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు అపారమైన అనుభవం ఉంది. లోకేష్ కి పేదల కష్టాలు తెలియకపోవచ్చు ఆయనకు అన్నీ తెలుసు. అయినా కూడా సెంటు జాగావే పేదలకు ఇస్తారా అంటూ నారాయణ గట్టిగా నోరు చేసుకొవడమే ఆశ్చర్యకరంగా ఉంది మరి. జగన్ సర్కార్ ఏది చేసినా తప్పుగా చెప్పాలన్న బాధ యావ తప్ప వామపక్ష సిధ్ధాంతాలను పట్టించుకుంటున్నారా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అభినందించలేని వామపక్షాలు పేదలకు ఇళ్ళ పట్టాల విషయంలోనూ లోపాలు వెతకడంలో విడ్డూరం లేదని కూడా అంటున్నారు.

అవినీతి ఆరోపణలు :

ఓ వైపు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున పంపిణీ చేస్తూంటే అందులో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందంటూ బీజేపీ టీడీపీ తేడా లేకుండా మాట్లాడుతున్నాయి. అవినీతిని నిరూపిస్తామంటూ సవాళ్ళు చేస్తున్నాయి. సత్యప్రమాణాలకు సిధ్ధమంటున్నాయి. దీని మీద బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ నాయకులూ ఒకే తీరున మాట్లాడుతున్నారు. రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలు చేశారంటూ ఓ వైపు ఢిల్లీలో రైతులు వేలాదిగా చలిని కూడా లెక్క చేయకుండా టెంట్లు వేసుకుని మరీ ఆందోళన చేస్తూంటే బీజేపీ మీద కిక్కురుమ‌నని మిత్రుడు పవన్ కళ్యాణ్ ఏపీలో రైతుల గురించి మాత్రం అసెంబ్లీని ముట్టడిస్తాను అనడాన్ని ద్వంద్వ ప్రమాణాలు అనక మరేమనాలో. అంటే జగన్ టార్గెట్ గా ఏపీలోని విపక్షాలు అన్నీ రెచ్చిపోతునాయన్నదే అర్ధమవుతున్న విషయం. మరి ఏపీ జనాలు కూడా రేపటి రోజున జగన్ నచ్చితే ఓటు వేస్తాడు, నచ్చని వారు వేసే ఓటు మాత్రం ఇలా విపక్షాల మధ్య చీలిపోతే మళ్లీ జగనే వస్తాడు. ఇది ఎన్నికల గణితం చెప్పే సత్యం. ఇది గ్రహిస్తున్నారా విపక్షాలు అన్నదే ప్రశ్న.

Tags:    

Similar News