Huzurabad : ఈ ఇద్దరు పోటీ పడుతుంది అందుకేనా?

హుజూూరాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గరపడింది. అయితే ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ఓట్లు ఎటువైపు మరలుతాయన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు 24 వేల ఓట్లు ఈ సామాజికవర్గానికి [more]

Update: 2021-10-19 09:30 GMT

హుజూూరాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గరపడింది. అయితే ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ఓట్లు ఎటువైపు మరలుతాయన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు 24 వేల ఓట్లు ఈ సామాజికవర్గానికి ఉన్నాయి. ఈ సామాజికవర్గం ఓట్లను పొందేందుకు టీఆర్ఎస్ ముందునుంచే ప్రణాళికను రూపొందించింది. కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వాలని మంత్రి వర్గం ఆమోదించింది. గవర్నర్ ఇంకా ఆమోదించలేదు.

బీజేపీని వీడి…..

మరోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి పెద్దిరెడ్డిని కూడా పార్టీలోకి తీసుకుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తేనే పెద్దిరెడ్డికి పదవి దక్కుతుంది. నామినేటెడ్ పోస్టు, లేదా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఇద్దరు నేతలు తమ సత్తాను నిరూపించుకునేందుకు పోటీ పడుతున్నారు. రెడ్డి సామాజికవర్గం ఓట్లతో పాటు తమకు కొంతకాలంగా వెన్నంటి ఉన్న క్యాడర్ ను గులాబీ పార్టీవైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇద్దరి మధ్య పోటీ…

ఈ పోటీలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయంటున్నారు. చేరికల సమయంలో వారు తమ వర్గం వారని చెప్పుకోవడానికి పోటీ పడుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంపై పెద్దిరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను బీజేపీ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఈటల రాజేందర్ చేరడంతో ఆయన పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఆయన లెక్క ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచినా వచ్చే ఎన్నికల నాటికి సమీకరణాలు మారతాయని భావిస్తున్నారు.

ఫలితాన్ని బట్టే…..

గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిచినా వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. లేకుంటే ఏదో ఒక పదవి వస్తుందని భావిస్తున్నారు. అందుకే కౌశిక్ రెడ్డిని మించి తాను ఏంటో నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. కానీ రెడ్డి సామాజికవర్గం ఈటల వైపు మొగ్గు చూపే అవకాశముంది. పార్టీని చూడకుండా ఈటల కుటుంబాన్ని చూసి ఓట్లేసే అవకాశముందంటున్నారు. సో.. టీఆర్ఎస్ లో ఈ ఇద్దరు రెడ్డినేతల భవిష్యత్ హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.

Tags:    

Similar News