ఆయన సైలెంటయ్యారు

ఆయన పంచ్ లేస్తే….ఎవరైనా జై కొట్టాల్సిందే. జనంలో అలా హాట్ హాట్ గా మాట్లాడుతూ అందరిని ఆకర్షించడంలో ఆయనకు ఆయనే సాటి. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ [more]

Update: 2019-10-02 09:30 GMT

ఆయన పంచ్ లేస్తే….ఎవరైనా జై కొట్టాల్సిందే. జనంలో అలా హాట్ హాట్ గా మాట్లాడుతూ అందరిని ఆకర్షించడంలో ఆయనకు ఆయనే సాటి. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఆయనెవరో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఆయన ఇప్పుడు ఆ పార్టీ నేతలకు కొయ్యగా మారాడు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కొత్త ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇందుకు అసలు కారణం… ఆ పార్టీలోని అంతర్గత విభేదాలే. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతికి హుజూర్ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. తాను సూచించిన అభ్యర్థికే టిక్కెట్ ఇవ్వాలంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా రేవంత్ మరో అడుగు ముందుకేసి పద్మావతికి కాకుండా తాను సూచించిన కిరణ్ రెడ్డికే టిక్కెట్ ఇవ్వాలంటూ ఏకంగా అధిష్టానానికి లేఖ ఇచ్చారు. ఉత్తమ్‌పై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియాకు ఫిర్యాదు చేయడం కూడా ఇందుకు కారణం.

రేవంత్ సైలెంట్….

అధిష్టానం మాత్రం హుజూర్ నగర్ బరిలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతికే టికెట్ ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి సైలెంట్ అయ్యారు. జోరుగా అక్కడ ప్రచారం సాగుతున్నా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ మాత్రం ఆ ఛాయల్లో కూడా కనిపించడం లేదు. మరో వైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ లోని పెద్దలందరూ ఏకమయ్యారు. గతంలో వారిమధ్య ఉన్న పొరపొచ్చాలు కూడా దూరం చేసుకుని అందరూ కలిసి హుజూర్ నగర్లో పద్మావతిని గెలిపించేందుకు కృషి చేస్తున్నారు.

ఆయన ఏం చేస్తారు…..?

పార్టీలో ఉన్న అభ్యర్థిని గెలిపించేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎంత బాధ్యత ఉంటుందో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. మరి డక్కా ముక్కిలు తిన్న రేవంత్ రెడ్డి మరి ఏం చేస్తారు. ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉంటారా..? ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే కొందరు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ హైకమాండ్… ఈ విషయంలో రేవంత్ రెడ్డిని మందలించినట్లుకూడా ప్రచారం జరుగుతోంది. దీంతో కొంత మనస్థాపం చెందిన రేవంత్ సైలెంట్ అయ్యారు. మరి రేవంత్ బాటలు ఎటువైపో వేచిచూడాల్సిందే.

 

Tags:    

Similar News