రాజధాని కథ ఎప్పటికీ తెమలేట్లు లేదుగా?

మూడు రాజధానుల కధ ఇపుడు ఏపీలో సీరియస్ టాపిక్ గా ఉంది. జగన్ గెలుస్తాడా. చంద్రబాబు కలల రాజధాని నిలుస్తుందా. ఇవన్నీ చర్చలే. మేధావులు, రాజ్యాంగ నిపుణులు, [more]

Update: 2020-08-10 14:30 GMT

మూడు రాజధానుల కధ ఇపుడు ఏపీలో సీరియస్ టాపిక్ గా ఉంది. జగన్ గెలుస్తాడా. చంద్రబాబు కలల రాజధాని నిలుస్తుందా. ఇవన్నీ చర్చలే. మేధావులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయం తెలిసిన వారు అంతా దీని మీదనే కుస్తీ పడుతున్నారు. ఏపీలో ఏం జరుగుతుంది. అమరావతి ఉంటుందా, పోతుందా జగన్ పట్టుదల ఎందాకా వెళ్తుంది అన్నది కూడా చర్చగానే ఉంది. ఇల్లు అలకగానే పండుగ కాదు అని మరో వైపు టీడీపీ తమ్ముళ్ళు రెచ్చగొడుతూంటే కోర్టు కేసుల వల్ల రాజధాని ఎప్పటికీ తెమలకుండా ఉంటుందని మరో వాదన వినిపిస్తోంది.

రాజధాని లేదా…?

మూడు రాజధానులు అన్నది పాలసీ డెసిషన్ అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హైకోర్టు లో దీని మీద సర్కార్ తరఫున న్యాయవాదులు ఇదే వాదన వినిపించారు. దీని మీద రాజ్యాంగ నిపుణులు కూడా రాజధాని అన్నది పాలకుల ఇష్టమే తప్ప రాజ్యాంగం ఎక్కడా ఏదీ నిర్దేశించలేదని అంటున్నారు. అదే విధంగా ఫలానా చోట రాజధాని ఉండాలని రాజ్యాంగంలో ఉండదని, అసలు రాజధాని అన్న ప్రస్తావనే రాజ్యాంగంలో లేదని కూడా చెబుతున్నారు. పాలకుడు తన సౌలభ్యం కోసం ఏదో ఒక నగరాన్ని ఎన్నుకుని పాలన సాగిస్తాడు, మిగిలిన వాటి కంటే అది ముఖ్య పట్టణంగా ఉంటుంది. ఇంతకు ముంచి రాజధానికి వేరేగా ఎక్కడా
నిర్వచనాలు కూడా ఏమీ లేవు. ఈ విషయంలో ఎంత లోతుగా వెళ్ళినా కూడా ప్రభుత్వ పాలసీలను ఎవరూ ప్రశ్నించజాలరని మేధావులు అంటున్నారు.

ఇష్టమేనా…?

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తాను అదే ప్రజలకు సౌలభ్యవంతమైన పాలన అందించాలంటే కొత్త విధానాలు రూపొందిస్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఎవరు ప్రభుత్వంలో ఉంటే వారికి రాజధాని మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందులో ఎవరూ తప్పుపట్టడానికి అసలు వీలులేదు. జగన్ ఆ మధ్యన అసెంబ్లీలో చెప్పినట్లుగా సీఎం ఎక్కడ నుంచి పాలిస్తే అదే రాజధాని. అంతే దానికి మించి డెఫినిషన్ కూడా రాజ్యాంగంలోనూ లేదు. అయితే ఇలా వీలుందని రాజధానిని ఎలా పడితే అలా మార్చుకోవచ్చా అన్నదే ఇక్కడ ప్రశ్న. దానికి సమాధానం కూడా ఉంది. డబ్బున్న వారికి నాలుగు కార్లు ఉంటాయి. లేని వారికి ఒక్క కారూ ఉండదు, ఏపీలో అన్ని ప్రాంతాలు అభివ్రుధ్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందువల్ల మూడు రాజధానులేంటి, వీలుంటే పదమూడు రాజధానులు కూడా చేసుకోవచ్చు. పిండి కొద్ది రొట్టె. అలాగే ప్రభుత్వాధినేత విధానాలు బట్టే ఆలోచనలు అని రాజ్యాంగ నిపుణులు, మేధావులు అంటున్నారు.

భారీగానేనట‌….

సరే ఇవన్నీ మామూలు సందర్భాల్లో. ఇపుడు అమరావతి రైతుల దగ్గర నుంచి వేలాది ఎకరాల భూములను తీసుకున్నారు. వారిని అలా వదిలేయడమేనా. అంటే ఇక్కడే కొంత న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారు. వారికి నష్టపరిహారం మాత్రం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. వారితో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ప్రభుత్వం గౌరవించాలి. అలాగని రాజధాని కట్టిస్తామని కాదు, వారి వద్ద తీసుకున్న భూములను ప్లాట్లుగా అభివ్రుధ్ధి చేసి తిరిగి ఇవ్వాలి. లేకపోతే వాటికి రేటు కట్టి నష్టపరిహారం అయినా ఇవ్వాలి. ఎటూ దీనికి వైసీపీ సర్కార్ సిధ్ధమని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు కాబట్టి మూడు రాజధానుల విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండవని అంటున్నారు. అయితే రైతుల నష్టపరిహారం ఎంత అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు లాంటి వారు లక్ష కోట్లు అవుతుంది అని చెబుతున్నారు. టీడీపీ వారైతే ప్రభుత్వం పూర్తిగా బడ్జెట్ తెచ్చి ఇచ్చినా చాలదు అనేస్తున్నారు. మరి ఈ తకరారు కనుక తీరితే మూడు రాజధానుల కధ సాఫీగా ముందుకు సాగినట్లే.

Tags:    

Similar News