వారికోసం వెయిటింగ్ …హోటల్ టోటల్ గా కాకుండా?

గుడ్డి కన్నా మెల్ల బెటర్ కదా అంటారు. ఇప్పుడు లాక్ డౌన్ దెబ్బకి కుదేలైన రంగాల్లో హోటల్ పరిశ్రమ కూడా ఒకటి. చోటా లాడ్జీ ల నుంచి [more]

Update: 2020-05-15 17:30 GMT

గుడ్డి కన్నా మెల్ల బెటర్ కదా అంటారు. ఇప్పుడు లాక్ డౌన్ దెబ్బకి కుదేలైన రంగాల్లో హోటల్ పరిశ్రమ కూడా ఒకటి. చోటా లాడ్జీ ల నుంచి స్టార్ హోటల్స్ వరకు కస్టమర్స్ లేక బోసి పోయి ఆర్ధికంగా కుదేలయిపోయాయి. ఎప్పటికి ఈ విపత్తు నుంచి బయట పడతామో కూడా వారికి అర్ధం కావడం లేదు. సంపాదన లేకపోయినా తమపై ఆధారపడిన వారికి జీతాలు ఇచ్చుకోవాలి. ఇవ్వలేక వదిలించుకుంటే నిపుణులైన వారు దొరకడం మరీ కష్టం. దాంతో ఇప్పటివరకు కూడబెట్టింది ఏమన్నా ఉంటే జేబులో నుంచి తీసి తిప్పలు పడుతుంది హోటల్ పరిశ్రమ.

ఆపరేషన్ వందేమాతరం …

విదేశాల్లో వైరస్ కారణంగా చిక్కుకుపోయిన భారతీయులను మాతృభూమికి రప్పించడానికి కేంద్రం వందేమాతరం ఆపరేషన్ మొదలు పెట్టింది. దీని వెనుక ఉభయకుశలోపరిగా అటు మన దేశానికి తిరిగి వచ్చేవారికి హోటల్ పరిశ్రమ కు ప్రయోజనం చేకూర్చేలా ప్లాన్ చేసింది. స్వదేశానికి తిరిగి వచ్చేవారు ఖచ్చితంగా 14 రోజులు ప్రభుత్వం సూచించే ఉచిత, పెయిడ్ క్వారంటైన్ లలో ఏదో ఒక దానిలో ఉండాలిసి ఉంది. దాంతో వారి వారి ఆర్ధిక స్థితిని బట్టి ప్రయాణికులు ఎదో ఒక హోటల్ ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దాంతో రెండు వారాలపాటు హోటల్ ఆక్యుపెన్సీ, ఫుడ్ ఐటమ్స్ తయారీ మొదలు కానున్నాయి.

పడకేసిన రంగం పైకి కొద్దిగా లేస్తుంది …

ఉచిత క్వారంటైన్ లో ఉండే సౌకర్యాలకు భయపడి చాలామంది అన్ని సౌకర్యాలు ఉండే హోటల్స్ లోనే ఉండేవారి శాతమే ఎక్కువ. ఇది ఒక రకంగా ఎకానమీ బూస్ట్ అవ్వడానికి ఉపయోగపడనుంది. 14 రోజుల తరువాత ప్రయాణికులు తిరిగి హోమ్ క్వారంటైన్ లో మరో 14 రోజులు ఉండాలన్న నిబంధన ఉంది. ఇలా ఎక్కడికక్కడ రక్షణ చర్యలు చేపడుతూనే కేంద్రం ఈ ఆలోచన చేయడం పట్ల ఆర్ధిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిన్నపాటి లాడ్జీలు మాత్రం కోలుకోవాలంటే జిల్లాల మధ్య రైలు, రోడ్డు రవాణా వ్యవస్థలు, దేశంలోని నగరాల నడుమ డొమెస్టిక్ విమాన రాకపోకలు పూర్తిస్థాయిలో మొదలు కావాలిసి ఉంది. అప్పటివరకు మరికొంతకాలం వారికి తిప్పలు తప్పవు.

Tags:    

Similar News