జ‌గ‌న్ గెలుపుపై వారిలో న‌మ్మ‌కం పెరిగిందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తాము క‌చ్చితంగా విజ‌యం సాధిస్తామ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ధీమాగా చెబుతున్నారు. తాము భారీ విజ‌యం సాధిస్తామ‌ని ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ [more]

Update: 2019-05-08 03:30 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తాము క‌చ్చితంగా విజ‌యం సాధిస్తామ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ధీమాగా చెబుతున్నారు. తాము భారీ విజ‌యం సాధిస్తామ‌ని ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ కు న‌మ్మ‌కంగా ఉన్నారు. ప‌లు స‌ర్వేలు, రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాలు కూడా ఇదేర‌కంగా ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తోంద‌ని, 150 సీట్లు గెలుస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సైతం చెబుతున్నారు. కానీ, ఈసీ, ఈవీఎంల‌పై ఆయ‌న త‌ర‌చూ ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టంతో గెలుపుపై పార్టీ శ్రేణుల్లోనే న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదు. ఇదే స‌మ‌యంలో ఐఏఎస్‌, ఐపీఎస్ ల‌లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంద‌నే న‌మ్మ‌కం పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని వారు న‌మ్ముతున్నారంట‌. ఇందుకు తాజాగా రెండు ఉదాహ‌ర‌ణ‌లు క‌నిపిస్తున్నాయి.

ఎల్వీకి పూర్తిగా మ‌ద్ద‌తుగా ఐఏఎస్ లు

ఇటీవ‌ల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నిక‌ల సంఘం ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంను నియ‌మించిన త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న‌పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న‌ను జ‌గ‌న్ కోవ‌ర్టుగా, నిందితుడి ఆరోపించారు. దీనిపై విశ్రాంత ఐఏఎస్ అధికారులు మండిప‌డ్డారు. చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేశారు. కానీ, ఐఏఎస్ లు మాత్రం నోరు మెద‌ప‌లేదు. ఐఏఎస్ లు అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మై ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చించాల‌నుకొని ఒక స‌మావేశం పెట్టుకున్నారు. కానీ ఈ స‌మావేశానికి ఎక్కువ మంది డుమ్మా కొట్టారు. దీంతో కోర‌మ్ లేక ఈ స‌మావేశాన్ని ర‌ద్దు చేశారు. కానీ, రెండు మూడు రోజుల క్రితం మ‌ళ్లీ ఐఏఎస్ అధికారులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి ఐఏఎస్ లు పెద్ద సంఖ్య‌లోనే వ‌చ్చారు. ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌ల‌ను త‌ప్పు ప‌ట్టిన వారు.. సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంకు పూర్తి మ‌ద్ద‌తుగా ఉండాల‌ని, ఒత్తిళ్ల‌కు లొంగ‌కుండా నిబంధ‌న‌ల ప్ర‌కారం న‌డుచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఐఏఎస్ అధికారులు ముఖ్య‌మంత్రి, మంత్రుల స‌మీక్ష‌లు, ప‌ర్య‌ట‌న‌ల‌కు కూడా హాజ‌రుకావ‌డం లేదు.

మ‌ళ్లీ రాష్ట్రానికి వ‌చ్చేందుకు ఆస‌క్తి…

ఇక‌, డెప్యూటేష‌న్ మీద కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిన ప‌లువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కూడా మ‌ళ్లీ రాష్ట్రానికి వ‌చ్చేందుకు మొగ్గు చూపుతున్నార‌ట‌. ఈ మేర‌కు ప‌లువురు అధికారులు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తెలుగుదేశం పార్టీతోనో, ఆ పార్టీ ముఖ్య నేత‌ల‌తో పొస‌గ‌క వీరు గ‌తంలో కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిన‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తార‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నందున మ‌ళ్లీ రాష్ట్రానికి వ‌చ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ ప‌రిణామాల‌న్నీ చూస్తుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు కాబోతుంద‌ని ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల్లో క్ర‌మంగా న‌మ్మ‌కం పెరుగుతుంద‌ని అంటున్నారు. ఒక‌వేళ ఇదే జ‌రిగితే తెలుగుదేశం పార్టీ ముఖ్యులకు స‌న్నిహితంగా మెలిగిన కొంద‌రు అధికారులు కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News