అమరావతిలో రామాలయం అందుకోసమేనా ?

అమరావతి చుట్టూ ఏమి జరుగుతుంది ? ఇప్పుడు మరోసారి అందరి చర్చ ఇటీవల హిందూ మహాసభ దక్షిణభారత రామాలయం కట్టనున్నట్లు ప్రకటన తరువాత మొదలైంది. రాజధానిని ఇక్కడే [more]

Update: 2020-07-12 12:30 GMT

అమరావతి చుట్టూ ఏమి జరుగుతుంది ? ఇప్పుడు మరోసారి అందరి చర్చ ఇటీవల హిందూ మహాసభ దక్షిణభారత రామాలయం కట్టనున్నట్లు ప్రకటన తరువాత మొదలైంది. రాజధానిని ఇక్కడే ఉంచాలని 200 రోజులు ఉద్యమించినా కరోనా మహమ్మారి ఆ పోరాటం పై నీళ్ళు చల్లేసింది. ఇప్పటికే కోర్టు ల ద్వారా ఈ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం కొనసాగుతుంది. అయినా కానీ జగన్ సర్కార్ తన అడుగులు రాజధాని వికేంద్రీకరణ దిశగానే సాగుతుంది. దాంతో కొత్త తరహాలో ఈ ఎపిసోడ్ లో బిజెపి కథ నడిపించేందుకు రామాలయ ఎజండా తోవ్యూహం రూపొందించిందా అన్న అనుమానాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

అన్ని కలిసొస్తాయా … ?

హిందూ మహా సభ రామాలయ ప్రకటన ఇలా జరిగిందో లేదో బిజెపి ఎంపి గా ప్రస్తుతం ఉన్న ఒకప్పటి టిడిపి అధినేత చంద్రబాబు కుడి భుజం సుజనా చౌదరి భారీ విరాళం ప్రకటించేశారు. సుజనా విరాళం తోనే రామాలయం వెనుక ఎదో జరుగుతుందనే అనుమానాలు వినపడుతున్నాయి. అమరావతి ప్రాంతాన్ని బిజెపి ఓన్ చేసుకునేందుకు ఈ కార్యాచరణ తీసుకుంటుందా అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్ లో వినవస్తున్నాయి.

రాజకీయ బాణమేనా?

లేకపోతే విజయవాడ ను హిందూ మహా సభ ఎందుకు ఎంచుకుంటుందని అంటున్నారు. రాజధాని ప్రాముఖ్యతను మరింత పెంచేందుకు దక్షిణభారత రామాలయం అనే పేరుతో రాజకీయం గానే ఈ అడుగులు వేసినట్లు విశ్లేషకుల అంచనా. ఏది ఏమైనప్పటికి హిందూ మహాసభ ద్వారా బిజెపి ఒకేసారి వైసిపి, టిడిపి లపై రాజకీయ బాణం ఎక్కుపెట్టేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తున్నా అమరావతి లోనే పూర్తిస్థాయి రాజధానిని ఉంచేందుకు కొత్త వ్యూహం ఏదో రచించినట్లే కనిపిస్తుంది. మరి ఇది వర్క్ అవుట్ ఎంతవరకు అవుతుందో చూడాలి.

Tags:    

Similar News