Tekkali : అన్నీ పోగొట్టుకున్నారని జాలిపడితే.. వీరు మాత్రం?

అధికారంలో ఉన్న మాటే కాని ఎక్కడా నేతల్లో సంతృప్తి లేదు. పదవులు ఇచ్చినా కొట్టుకు ఛస్తున్నారు. పార్టీని గాలికి వదిలేసి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. టెక్కలి నియోజకవర్గంలో [more]

Update: 2021-09-24 05:00 GMT

అధికారంలో ఉన్న మాటే కాని ఎక్కడా నేతల్లో సంతృప్తి లేదు. పదవులు ఇచ్చినా కొట్టుకు ఛస్తున్నారు. పార్టీని గాలికి వదిలేసి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఇదే జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ ల మధ్య పూర్తి స్థాయిలో విభేదాలు తలెత్తాయి. ఇద్దరూ వైసీపీ నేతలే. ఇద్దరూ గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేశారు. ఇద్దరూ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు దక్కించుకున్నా వారికి సంతృప్తి లేదు.

ఇద్దరూ ఆర్థికంగా నష్టపోయి…

శ్రీకాకుళం నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ లు వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. పార్టీ కోసం శ్రమిస్తున్నారు. దానిని ఎవరూ కాదనలేరు. అందుకే గత ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీకి పేరాడ తిలక్ ను, శ్రీకాకుళం అసెంబ్లీకి దువ్వాడ శ్రీనివాస్ లకు జగన్ టిక్కెట్లు కేటాయించారు. అయితే ఇద్దరూ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గత ఎనిమిదేళ్ల నుంచి ఇద్దరూ పార్టీ కోసం పనిచేసి ఆర్థికంగా నష్టపోయిన వారే.

ఇద్దరికీ పదవులు…

అందుకే అధికారంలోకి రాగానే జగన్ ఇద్దరికి పదవులు ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి, పేరాడ తిలక్ కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. టెక్కలి నియోజకవర్గానికి పేరాడ తిలక్ పార్టీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన నాటి నుంచి విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. టెక్కలిలో తన మాటే చెల్లాలంటూ ఇద్దరూ భీష్మించుకుని కూర్చోవడంతో క్యాడర్ కూడా ఇబ్బందులు పడుతుంది.

వీధిన పడి….

ఎంపీటీసీ ఎన్నికలలో వైసీపీ టెక్కలిలో పూర్తి స్థానాలను కైవసం చేసుకున్నా ఫలితం లేదు. ఇద్దరి మధ్య విభేదాలు పార్టీని నవ్వుల పాలు చేస్తున్నాయి. 11 మందిని పేరాడ తిలక్ కిడ్నాప్ చేశారంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. తన వర్గానికి చెందిన వారినే ఎంపీపీని చేయాలంటూ పేరాడ తిలక్ పట్టుబడుతున్నారు. ఈ పంచాయతీ అధిష్టానం వద్దకు చేరింది. ఇద్దరికి పదవులు ఇచ్చినా బలమైన టీడీపీ నేత ఉన్న టెక్కలి నియోజకవర్గంలో వీరి మధ్య విభేదాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం.

Tags:    

Similar News