పార్టీతో అనుబంధం లేకపోయినా?

సాధారణంగా బీజేపీలో సుదీర్ఘంగా ఉండి, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. కానీ అనూహ్యంగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ నేపథ్యం చూస్తే [more]

Update: 2021-05-10 17:30 GMT

సాధారణంగా బీజేపీలో సుదీర్ఘంగా ఉండి, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. కానీ అనూహ్యంగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ నేపథ్యం చూస్తే ఆయన బీజేపీలో చేరి ఆరేళ్లు మాత్రమే. అయినా హిమంత బిశ్వా శర్మకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. దీని వెనక ఆయన శ్రమ, పట్టుదల ఉన్నాయంటున్నారు. బీజేపీలో అసాధరణమైన ఎంపిక ఇది అని పార్టీలో చర్చ జరుగుతోంది.

నేపథ్యమంతా కాంగ్రెస్ ….

హిమంత బిశ్వా శర్మ రాజకీయ నేపథ్యమంతా కాంగ్రెస్ లోనే కొనసాగింది. అసోంలో కాంగ్రెస్ ముఖ్యనేతగా కొనసాగారు. అయితే ఆయనకు కాంగ్రెస్ లో తగిన ప్రాధాన్యత లభించలేదు. దీంతో 2015లో తరుణ్ గొగొయ్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి బీజేపీ కండువా కప్పుకున్నారు. అసోంలో పట్టున్న నేత కావడంతో హిమంత బిశ్వా శర్మ కు బీజేపీ కూడా ప్రాధాన్యం ఇచ్చింది. అప్పట్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కారణమయిన హిమంత బిశ్వా శర్మ కు నేడు ముఖ్యమంత్రి పదవి దక్కింది.

ఆరేళ్లలోనే….

హిమంత బిశ్వా శర్మకు ఆరేళ్ల కాలంలోనే బీజేపీ మెంటర్ గా పేరు పొందారు. 1990 నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ తో మొదలయింది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన హిమంత బిశ్వా శర్మ ఈశాన్య భారతంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటకు కారణమయ్యారు. ఆయన రాజకీయ ఎత్తుగడలు, ఎన్నికల్లో వ్యూహరచనలు మోదీ, షాలను ఆకట్టుకున్నాయి. ఆయన బీజేపీ లో చేరిన నాటినుంచి సీఎం పదవిపైనే కన్నేశారు.

వ్యూహకర్తగా….

ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమంత బిశ్వా శర్మ పాత్ర కీలకం. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం వెనక హిమంత బిశ్వా శర్మ శ్రమ ఉందని బీజేపీ కేంద్ర నాయకత్వం గుర్తించింది. త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి హిమంత బిశ్వా శర్మ కృషి చేశారు. దీంతోనే ఆయనకు అసోం ముఖ్యమంత్రి పదవి దక్కిందని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చి అనతి కాలంలోనే బీజేపీ ముఖ్యమంత్రిగా అయి హిమంత బిశ్వా శర్మ రికార్డు సృష్టించారు.

.

Tags:    

Similar News