ముందే వెళ్లిపోతున్నారు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పిలుపుతో జనం జాగ్రత్త పడుతున్నారు. ఐదోతేదీ నుంచి సమ్మె ఉంటుందనే భయంతో ఊర్లకు ముందే పయనమవుతున్నారు. దీంతో హైదరాబాదులోని ఆర్టీసీ బస్ స్టేషన్లు, [more]

Update: 2019-10-02 12:22 GMT

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పిలుపుతో జనం జాగ్రత్త పడుతున్నారు. ఐదోతేదీ నుంచి సమ్మె ఉంటుందనే భయంతో ఊర్లకు ముందే పయనమవుతున్నారు. దీంతో హైదరాబాదులోని ఆర్టీసీ బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. వరుసగా సెలవులు రావడంతో పోయేదేదో ఇప్పుడే వెళ్లిపోవాలని నగర ప్రయాణికులు మూటా, ముల్లె సర్దేసుకుంటున్నారు.

పెరిగిన రద్దీ……

ఎలాగూ పిల్లలకు సెలవులు వచ్చేశాయి. పోయేదేదో ఇప్పుడే వెళ్లిపోతే బాగుంటుందని నగర ప్రయాణికులు ఆలోచిస్తున్నారు. సమ్మెతో మనకెందుకు గొడవ అనుకుంటున్నారు. పండగకు మూడు రోజుల ముందు వెళ్లే కంటే ఆరు రోజుల ముందే వెళ్తే ఏ టెన్షన్ ఉండదని భావిస్తున్నారు. దీంతో ఈ రోజు నుంచి మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జేబీఎస్ ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది.

అప్పటికి చూసుకుందాం…

వెళ్లడమైతే వెళ్తున్నాం…… మరి వచ్చేటప్పుడేంటనే ప్రశ్న కూడా ప్రయాణికుల్లో తలెత్తుతోంది. అప్పటికి సమ్మె సడలిస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడైతే వెళ్లిపోతే అప్పటికి చూసుకోవచ్చులేనంటున్నారు. ఈ నెల 14వరకు సెలవులు ఉండడంతో అప్పటికి వరకు ఆలోచిస్తామంటున్నారు ప్రయాణికులు.

 

Tags:    

Similar News