అందరినీ టెన్షన్ పెడుతుందే?

ఐపీఎల్….. వరల్డ్ కప్ మ్యాచ్ లలో కోట్ల రూపాయల బెట్టింగులు చూశాం… సాధారణ ఎన్నికల్లోనూ పార్టీలపై పందేలు చూశాం. కాని ఇప్పుుడు అక్కడ రోజు రోజుకు సీన్ [more]

Update: 2019-10-18 09:30 GMT

ఐపీఎల్….. వరల్డ్ కప్ మ్యాచ్ లలో కోట్ల రూపాయల బెట్టింగులు చూశాం… సాధారణ ఎన్నికల్లోనూ పార్టీలపై పందేలు చూశాం. కాని ఇప్పుుడు అక్కడ రోజు రోజుకు సీన్ మారుతోంది. బెట్టింగ్ రాయుళ్లంతా ఇప్పుుడు హుజూర్ నగర్ లో జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని పందాలు కాస్తున్నారు. మరి గెలుపోటములు ప్రజలు ఎలా నిర్ణయిస్తారో చూడాల్సిందే.

కేసీఆర్ తో దోస్తీ….

హుజూర్ నగర్ గతంలో కమ్యూనిస్టులకు అండగా ఉండేది. రాను రాను కొంత ప్రభావం తగ్గినప్పటికి అక్కడ వామపక్షాలు బలంగానే ఉన్నాయి. సీపీఐకి ఎనిమిది వేల ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపఎన్నికలో తమ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించుకునేందుకు సీపీఐతో దోస్తీ చేశారు. వారు కూడా మద్దతు ప్రకటించారు. దీంతో అధికార పార్టీకి గెలిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కాని ఇప్పుడు సీన్ మారింది.

దోస్తానా…కటీఫ్

ఆర్టీసీ కార్మికులు సమ్మె తలపెట్టడం…… ఎప్పుడూ కార్మికుల పక్షాన ఉండే వామపక్ష పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం పట్ల కొంత వ్యతిరేకత వచ్చింది. దీంతో సుదీర్ఘ చర్చల అనంతరం సీపీఐ ఎట్టకేలకు హుజూర్ నగర్ లో అధికార టి.ఆర్.ఎస్ పార్టీకి మద్దతును ఉపసంహరించింది. దీంతో మళ్లీ అంచనాలు తారుమారవుతున్నాయి. కమ్యూనిస్టుల కోటలో ఉన్న ఓట్లు ఎటు పడతాయని ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారు.

ఇలాకామే సవాల్…..

హుజూర్ నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ తో పాటు అనేక మంది స్వతంత్రులున్నప్పటికీ పోటీ మాత్రం కేవలం కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్యలోనే నెలకొంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకున్న సొంత ఇమేజీతో భార్య పద్మావతి రెడ్డిని గెలిపించుకునేందకు కృషిచేస్తున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ప్రభుత్వ పథకాలు, టిఆర్ఎస్ క్యాడర్ తో గెలవాలని ప్రయత్నిస్తున్నారు.

పందెం రాయుళ్లు…..

హుజూర్ నగర్లో ఉప ఎన్నిక గెలుపుపై స్థానిక ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చలు పందెం వేసుకునే వరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న జనం వందల రూపాయలతో మొదలైన ఈ బెట్టింగ్ లు రోజు రోజుకు లక్షల రూపాయలకు పైగా సాగుతోంది. హుజూర్ నగర్ సరిహద్దు జిల్లా కావడంతో కృష్ణా, గుంటూరు, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లా వాసులు కూడా కొందరు హుజూర్ నగర్ వచ్చి ఇక్కడి గెలుపోటములపై దృష్టిసారించారు. కులాలు, సామాజిక వర్గాల వారీగా ఓట్లను విభజిస్తూ ఆయా పార్టీలు సామాజిక వర్గాలపై అంచనాలు వేసి పందాలు కాస్తున్నారు. నిఘా వర్గాలు సైతం బెట్టింగ్ ల వ్యవహారాలపై ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో అందించినట్లు సమాచారం.

 

 

Tags:    

Similar News