వారికి ఛాన్స్… వదులుకోరట.. జగన్ ఎదుటే?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో 22 మంది పార్లమెంటు సభ్యులున్నారు. కానీ వారు మాత్రం గత ఆరేడునెలలుగా మౌనంగానే ఉంటున్నారు. రఘురామ కృష్ణంరాజు రెబల్ గా [more]

Update: 2020-08-31 08:00 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో 22 మంది పార్లమెంటు సభ్యులున్నారు. కానీ వారు మాత్రం గత ఆరేడునెలలుగా మౌనంగానే ఉంటున్నారు. రఘురామ కృష్ణంరాజు రెబల్ గా మారి యాక్టివ్ గా ఉన్నా మిగిలిన ఎంపీల్లో నలుగురు మినహా ఎవరూ ఎక్కడా కన్పించడం లేదు. వారి వ్యాపారాలకే పరిమితమయ్యారు. కరోనా సమయంలోనూ ఎంపీలు కన్పించలేదు. అలాగే వరద బీభత్సం జరిగినా స్పందించలేదు. దీనికి కారణం ఎమ్మెల్యే వ్యవహారశైలి అని వారు బహిరంగంగానే చెబుతున్నారు.

ఉన్న 22 మంది ఎంపీల్లో…

ఏపీలో వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీల్లో చాలా మంది కొత్తగా వచ్చిన వారే. రాజకీయాలు వారికి కొత్త. అలాగని ఏమీ తెలియదని కాదు. కానీ వారిలో అధికశాతం మంది పార్టీ యాక్టివిటీస్ కు దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ వారానికొక పథకాన్ని లాంచ్ చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లోనూ వారు పెద్దగా పాల్గొనడం లేదు. ఇటీవల రఘురామ కృష్ణంరాజుపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడానికి మాత్రం కొందరు ఎంపీలు ఢిల్లీలో కన్పించారు.

వీరంతా దూరంగా…..

విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, హిందూపురం, కర్నూలు, ఏలూరు ఎంపీల జాడ తెలియడం లేదంటున్నారు. మిగిలిన ఎంపీలు అక్కడక్కడా కన్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యేల నుంచి తమకు ఆహ్వానం అందడం లేదని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు తాము వస్తే ప్రొటోకాల్ పాటించాల్సి వస్తుందని కనీసం ఆహ్వానాలు కూడా పంపడం లేదని వారు చెబుతున్నారు.

జగన్ తో జరిగే సమావేశంలో…..

దీనిపై కొందరు ఎంపీలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా తమకు దూరంగా పెట్టడంపై వారు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ముందు జగన్ పార్లమెంటరీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు ఎంపీలు కొందరు రెడీ అవుతున్నారు. పూర్తి ఆధారాలతో తమను ఎమ్మెల్యేలు ఎలా అవమానించారో వారు జగన్ ఎదుట చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. మరి జగన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News