ప‌దే ప‌దే హ‌రీష్‌కు ఈ అగ్నిప‌రీక్షలెందుకో ?

తెలంగాణ‌లో కేసీఆర్ త‌ర్వాత వార‌స‌త్వ స‌మ‌స్య గురించే నిన్నమొన్న‌టి వ‌ర‌కు చ‌ర్చలు న‌డిచాయి. కేసీఆర్ సైతం ప‌రోక్షంగా కేటీఆర్‌ను ఎంక‌రేజ్ చేస్తున్నట్టు క‌నిపించినా తాజా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు, [more]

Update: 2021-03-12 09:30 GMT

తెలంగాణ‌లో కేసీఆర్ త‌ర్వాత వార‌స‌త్వ స‌మ‌స్య గురించే నిన్నమొన్న‌టి వ‌ర‌కు చ‌ర్చలు న‌డిచాయి. కేసీఆర్ సైతం ప‌రోక్షంగా కేటీఆర్‌ను ఎంక‌రేజ్ చేస్తున్నట్టు క‌నిపించినా తాజా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు, గ్రేట‌ర్లో మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం కేటీఆర్‌ను కూడా ప‌క్కన పెట్టేశారు. ఇక ఈ వార‌స‌త్వ స‌మ‌స్య ఎలా ఉన్నా ? హ‌రీష్‌రావుకు మాత్రం కేసీఆర్ ప‌దే ప‌దే అగ్నిప‌రీక్షలు పెడుతోన్న ప‌రిస్థితి. వాస్తవంగా ఉమ్మడి మెద‌క్ జిల్లాకు చెందిన బాధ్యత‌లే ఇప్పటి వ‌ర‌కు హ‌రీష్‌రావుకు అప్ప‌గిస్తూ వ‌స్తోన్న కేసీఆర్ ఇప్పుడు ఇత‌ర జిల్లాల ఎన్నిక‌లు బాధ్యత‌లు కూడా ఇస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల బాధ్యత అంతా హ‌రీష్‌రావు భుజ‌స్కంధాల మీదే వేశారు. చివ‌ర‌కు కేసీఆర్ ప్రచారానికి కూడా వెళ్లలేదు.

ఒక్కసారి కూడా విజయం….

అక్కడ పార్టీ ఓడిపోవ‌డంతో ఆ బాధ్యత అంతా హ‌రీష్ రావు మోశారు. ఇక త్వర‌లో జ‌ర‌గ‌బోతోన్న గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌, గ్రేట‌ర్ ఖ‌మ్మం కార్పొరేష‌న్ల ఎన్నిక‌ల బాధ్యత‌లు మంత్రి కేటీఆర్‌కు ఇస్తున్నార‌ట‌. ఇదిలా ఉంటే త్వర‌లోనే జ‌రుగుతోన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఫ‌లితాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అగ్నిప‌రీక్షగా మారాయి. ఇందులో ఒకటి వరంగల్-నల్గొండ-ఖమ్మం నియోజకవర్గం కాగా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ రెండోది. అయితే.. ఇందులో ఈ రెండో నియోజకవర్గం బాధ్యతను హరీష్ రావుకు అప్పగించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ఎస్‌కు చాలా సంక్లిష్టం. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్పడిన‌ప్పటి నుంచి ఒక్క‌సారి కూడా టీఆర్ఎస్ విజ‌యం సాధించ‌లేదు.

వరసగా ఓటములతో…

హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి 2007, 2009, 2015 మూడు సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక్కడ 2009లో పోటీకి దూరంగా ఉన్న టీఆర్ఎస్ రెండు సార్లు ఓడిపోయింది. 2007లో పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్వల్ప తేడాతో ఓడారు. 2009లో ప్రొఫెస‌ర్ కె. నాగేశ్వర్‌కు టీఆర్ఎస్ మ‌ద్దతు ఇచ్చింది. 2015లో పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని కేసీఆర్ పెద్ద స్కెచ్ వేశారు. టీఎన్జీవో యూనియ‌న్ అధ్యక్షుడు దేవీ ప్ర‌సాద్‌ను ఉద్యోగానికి రాజీనామా చేయించి మ‌రీ పోటీ చేయించినా పార్టీ ఓడింది.

సంక్లిష్టమైన నియోజకవర్గంలో….

అలాంటి సంక్లిష్టమైన నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు హ‌రీష్‌రావుకు బాధ్యతలు అప్పగించ‌డంతో ఆయ‌న‌కు క‌ఠిన‌మైన అగ్నిప‌రీక్ష పెట్టార‌ని అంటున్నారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం హ‌రీష్‌రావు సైతం ఎంతో శ్రమిస్తున్నారు. ఈ సారి కూడా ఇక్కడ రిజ‌ల్ట్ తేడా వ‌స్తే హ‌రీష్‌రావు ప్రాధాన్యత మ‌రింత త‌గ్గుతుంద‌నే అంటున్నారు. ఇక్కడ గెలుపు ఓట‌ముల‌కు హ‌రీష్‌రావు ప‌ద‌వుల‌కు ఇప్పటికిప్పుడు వ‌చ్చిన ఇబ్బందేమి లేక‌పోయినా హ‌రీష్ ట్రబుల్ షూట‌ర్ క‌దా ? ఆయ‌న ఖాతాలో మ‌రో వైఫ‌ల్యం వేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న ప్రచారం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

Tags:    

Similar News