ఒక్క ఛాన్స్ ఇస్తే..దానితోనే సరిపెడతారా?

రాజకీయాల్లో ఒకసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారు అరుదుగానే ఉంటారు. కొందరు ఒకసారి రాజకీయాల్లో మెరిసి అలా వెళ్లిపోతుంటారు. రాజకీయాల్లో ప్రజల విశ్వాసం ముఖ్యం. అయితే [more]

Update: 2020-07-05 16:30 GMT

రాజకీయాల్లో ఒకసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారు అరుదుగానే ఉంటారు. కొందరు ఒకసారి రాజకీయాల్లో మెరిసి అలా వెళ్లిపోతుంటారు. రాజకీయాల్లో ప్రజల విశ్వాసం ముఖ్యం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ స్టెంట్ పాలిటిక్స్ కు అలవాటు పడి ఎటు గాలి ఉంటే అటు వైపు వెళున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అతి చిన్న వయసులో ఎమ్మెల్యే గా ఎన్నికయిన హరిప్రియ రాజకీయంగా నిలదొక్కుకుందా? లేదా? అన్నదే సందేహం.

కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి…..

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గం నుంచి హరిప్రియ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెపై టీఆర్ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య నిలబడ్డారు. కోరం కనకయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే కావడతో హరిప్రియ నాయక్ విజయం అసాధ్యమనుకున్నారు. కానీ ఎవరు ఊహించని రీతిలో విజయం సాధించారు. అయితే మెజారిటీ కేలవం 2,654 మాత్రమే. అంటే అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య హరిప్రియ నాయక్ కు గట్టి పోటీ ఇచ్చారనే అనుకోవాలి.

అతి చిన్న వయసులో…..

హరిప్రియ నాయక్ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో వయసు 29 ఏళ్లు. అతి చిన్న వయసులో అసెంబ్లీలోకి అడుగు పెట్టారు హరిప్రియ. ఉన్నత చదువులు చదివిన హరిప్రియ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటారనుకున్నారు. కానీ సీనియర్లను తలదన్నే రీతిలో హరిప్రియ కాంగ్రెస్ ను వదిలేసి అధికార పార్టీ వైపు చూశారు. నిజానికి కాంగ్రెస్ సీటు ఆమెకు ఊరికే రాలేదు. టీపీసీసీ మహిళా విభాగంలో ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. రేవంత్ రెడ్డి పట్టుబట్టి హరిప్రియకు టిక్కెట్ ఇప్పించారన్నది కూడా వాస్తవమే.

అనుభవ లేమితో…..

అలాంటి హరిప్రియ ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా వెళ్లడంతో నియోజకవర్గంలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిచడంలోనూ హరిప్రియ చొరవచూపడం లేదన్న టాక్ ఉంది. దీంతో పాటు హరిప్రియకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ లో ఒక వర్గం గట్టిగా పావులు కదుపుతోంది. దీంతో రాజకీయ అనుభవం లేని హరిప్రియ ఇబ్బంది పడుతున్నారంటున్నారు. నియోకవర్గంలో కూడా హరిప్రియ పెద్దగా పర్యటించకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో హరిప్రియ కు చేదు అనుభవం ఎదురుకాక తప్పదు.

Tags:    

Similar News