Bjp tdp ap : వీళ్లిద్దరినీ వాళ్లే కలుపుతారా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ శత్రువులుగానే ఉన్నాయి. చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నా కొందరు నేతలు దానికి అడ్డంకిగా మారారు. మోదీకి, చంద్రబాబుకు మధ్య [more]

Update: 2021-09-21 13:30 GMT

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ శత్రువులుగానే ఉన్నాయి. చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నా కొందరు నేతలు దానికి అడ్డంకిగా మారారు. మోదీకి, చంద్రబాబుకు మధ్య గ్యాప్ పెరగడంతో ఈసారి కూడా ఇద్దరి మధ్య పొత్తు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు సయితం అంచనా వేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు బీజేపీతో సయోధ్య కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు.

వైసీపీ నేతల కామెంట్స్ తో…

అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నేతలే ఇద్దరి మధ్య పొత్తు కుదిరేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు. వైసీపీ నేతలు ఇలాగే వ్యవహరిస్తే బీజేపీ నేతలే చంద్రబాబుతో స్నేహం కోసం ముందుకు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. మాంసం, చేపల విక్రయాలు ప్రభుత్వం చేపట్టాలన్న నిర్ణయంపై అభ్యంతరం తెలిపారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

సోముపై మంత్రి….

కానీ మంత్రి సీదిరి అప్పలరాజు మాత్రం సోము వీర్రాజు లేఖకు కొత్త భాష‌్యం చెప్పారు. ఆ లేఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారైందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పినట్లే సోము వీర్రాజు నడుచుకుంటున్నారని విమర్శించారు. జగన్ కు లేఖ రాసే బదులు ప్రత్యేక హోదా కోసం సోము వీర్రాజు ప్రధాని మోదీకి లేఖ రాయడం మంచిదని మంత్రి సూచించారు. ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో ఆనందం నింపాయి.

ఆ అవకాశాన్ని….

రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పుడే కాస్తో, కూస్తో సీట్లు గెలుచుకుంది. టీడీపీ వల్ల బీజేపీ ఏపీలో ఎదగలేదని సోము వీర్రాజు వంటి నేతలు ఇప్పటి వరకూ అధినాయకత్వానికి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వైసీపీ నేతల కామెంట్స్ ఇద్దరూ మరోసారి కలసి పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు పెద్దగా శ్రమ లేకుండానే ఆయన అనుకున్న పనిని వైసీపీ నేతలు పూర్తి చేస్తున్నారు.

 

 

Tags:    

Similar News