జీవీఎల్ ఒంట‌రి అవుతున్నారా…?

రాజ‌కీయాల్లో నాయ‌కులు క‌దులుతున్నారంటే.. వారి వెంట ఓ వంద మందో.. హీన ప‌క్షం యాభైమందో.. క‌నీసంలో క‌నీసం.. ప‌దిమందైనా క‌దులుతారు.. నేత‌ల‌ను అనుస‌రిస్తారు. వాస్తవానికి నేత‌ల అండ‌, [more]

Update: 2020-09-25 13:30 GMT

రాజ‌కీయాల్లో నాయ‌కులు క‌దులుతున్నారంటే.. వారి వెంట ఓ వంద మందో.. హీన ప‌క్షం యాభైమందో.. క‌నీసంలో క‌నీసం.. ప‌దిమందైనా క‌దులుతారు.. నేత‌ల‌ను అనుస‌రిస్తారు. వాస్తవానికి నేత‌ల అండ‌, దండా కూడా ఈ అనుచ‌రులు.. నేత‌లే! పార్టీ ఏదైనా ఫార్ములా మాత్రం ఇదే..! అయితే, ఈ ఫార్ములాను పూర్తిగా అమ‌లు చేయ‌డంలో బీజేపీ నాయ‌కుడు, కేంద్రంలోనూ చ‌క్రం తిప్పుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన నేత‌.. జీవీఎల్ న‌ర‌సింహారావు వెనుక‌బ‌డ్డార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కన్నా అధ్యక్షుడిగా ఉన్నప్పడు….

కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న జీవీఎల్ న‌ర‌సింహారావు ఏపీలోనూ అదే రేంజ్‌లో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. రాష్ట్రంలోని బీజేపీ నేత‌ల‌కు కేంద్రంలో క‌నిపిస్తున్న పెద్ద నాయ‌కుడు ఆయ‌నే. గ‌తంలో వెంక‌య్య నాయుడు, కంభం పాటి హ‌రిబాబు వంటి వారు ఉండేవారు. సో.. వారికి త‌మ స‌మ‌స్యలు చెప్పుకొనే వారు అయితే, ఇప్పుడు వారు లేరు. మిగిలి వారిలో మాధ‌వ్‌.. ఉన్నప్పటికీ.. ఆయ‌న ఈశాన్య రాష్ట్రాల ఇంచార్జ్‌గా ఉన్నారు. దీంతో అక్కడి రాజ‌కీయాల‌తోనే ఆయ‌న బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో జీవీఎల్ న‌ర‌సింహారావు ఒక‌ర‌కంగా .. ఏపీ బీజేపీ నేత‌ల‌కు హీరో అయిపోయారు.

ఎప్పుడు ఏపీకి వచ్చినా….

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ రాష్ట్ర బీజేపీ సార‌థిగా ఉన్నస‌మ‌యంలో జీవీఎల్‌కు మ‌రింత ప్రాధాన్యత ద‌క్కింది. ఆయ‌న ఎప్పుడు ఏపీకి వ‌చ్చినా.. ఇక్కడ మీడియా మీటింగులు పెట్టినా.. వంద‌ల మంది నాయ‌కులు క్యూక‌ట్టేవారు. రాష్ట్ర బీజేపీ సార‌ధిగా క‌న్నా కూడా ఆయ‌న వెంట ఉండేవారు. అయితే, ఎందుకో.. క‌న్నా మారి.. సోము వీర్రాజు రాష్ట్ర పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత మాత్రం.. జీవీఎల్ న‌ర‌సింహారావు ప్రభావం బాగా తగ్గింద‌ని నేత‌లు చెవులు కొరుక్కుంటున్నారు. గ‌తంలో ఉన్న హ‌వా కానీ, అంతా ఆయ‌న‌కు చెప్పి చేయాల‌నే ధోర‌ణి కానీ.. పార్టీలో క‌నిపించ‌డం లేద‌ని.. అంటున్నారు.

ఆయన నిర్ణయాలపై….

రాష్ట్ర సార‌థిగా ఉన్న సోము వీర్రాజు.. స్వయంగా నిర్ణయాలు తీసుకోవ‌డం, ఆయ‌నే పార్టీని ముందుకు న‌డిపించ‌డం వంటివి చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో జీవీఎల్ న‌ర‌సింహారావు ఏపీ బీజేపీలో ఒంట‌రి అయ్యారే అని అనేవారు పెరుగుతున్నారు. పైగా ఆయ‌న రాజ‌ధాని అమ‌రావ‌తిపై తీసుకున్న స్టాండ్ కూడా బీజేపీలోని పురందేశ్వరి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స‌హా క‌మ్మవ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌కు రుచించ‌లేదు. దీంతో వారు కూడా ఇండిపెండెంట్‌గానే ఆయ‌న‌కు దూర‌మ‌య్యార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News