హర్షకుమార్ మరో చింతా కాక తప్పదా?

అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యుడు జీవీ హర్షకుమార్ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా పూర్తిగా దెబ్బతిన్నారు. ఆయన వేసే ప్రతి అడుగు ఆయనను మరింత అగాధంలోకి నెట్టేస్తున్నాయి. [more]

Update: 2021-06-08 00:30 GMT

అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యుడు జీవీ హర్షకుమార్ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా పూర్తిగా దెబ్బతిన్నారు. ఆయన వేసే ప్రతి అడుగు ఆయనను మరింత అగాధంలోకి నెట్టేస్తున్నాయి. వరసగా పార్టీలు మారుతూ, వీడుతూ హర్షకుమార్ సాధించిందేమిటన్న ప్రశ్న ఆయన అనుచరుల నుంచే వస్తుంది. దళిత నేతగా హర్షకుమార్ కు మంచి పేరుంది. రెండు సార్లు ఎంపీగా గెలిచిన హర్షకుమార్ కు అదే చివరి అవకాశంగా మిగలనుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

పార్టీలు మారుతూ….

రాష్ట్ర విభజన జరిగిన వెంటనే హర్షకుమార్ కిరణ్ కుమార్ ప్రారంభించిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన పార్టీలు మారుతూనే ఉన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి ఆయన తెలుగుదేశంపార్టీలోచేరారు. అయితే ఆయనకు ఆ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడం, తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో హర్షకుమార్ తిరిగి కాంగ్రెస్ లో చేరారు.

కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగితే?

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. పోటీ అంతా వైసీపీ, టీడీపీ మధ్యనే ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో జనసేన, బీజేపీ బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో హర్షకుమార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఫలితం శూన్యం. త్రిముఖ పోటీ మధ్య ఆయన నెట్టుకు రావడం కష్టమే. హర్షకుమార్ ఉన్న టీడీపీని వదిలేశారు. టీడీపీలో ఉన్నా టిక్కెట్ ఈసారి దక్కేదని చెబుతున్నారు.

ఎటూ వెళ్లలేక….?

ఇక వైసీపీలోకి హర్షకుమార్ వెళ్లలేరు. జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీలోకి కూడా వెళ్లేందుకు హర్షకుమార్ సుముఖంగా లేరు. దళిత నేత కావడంతో ఆ సామాజికవర్గం పైనే హర్షకుమార్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కానీ వైసీపీ ఆ ఓటు బ్యాంకును కొల్లగొడుతుండటంతో ఈసారి కూడా హర్షకుమార్ కు కలసి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. మరి ఎన్నికల నాటికి హర్షకుమార్ మరో పార్టీలోకి జంప్ చేస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News