ఈయనకు బెర్త్ ఖాయమా… ?

జగన్ లిస్ట్ లో దృష్టిలో ఉంటేనే ఎవరికైనా ఏమైనా పదవులు దక్కుతాయి. అందుకోసమే వైసీపీ నేతలు తరచూ తాపత్రయపడుతూంటాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య జరిగిన బడ్జెట్ [more]

Update: 2021-06-10 09:30 GMT

జగన్ లిస్ట్ లో దృష్టిలో ఉంటేనే ఎవరికైనా ఏమైనా పదవులు దక్కుతాయి. అందుకోసమే వైసీపీ నేతలు తరచూ తాపత్రయపడుతూంటాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య జరిగిన బడ్జెట్ సెషన్ లో మాట్లాడిన అతి కొద్ది మందిలో విశాఖ నుంచి యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ కి అవకాశం దక్కింది. అది కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ తీర్మానం మీద మాట్లాడే చాన్స్ రావడం లక్కీయే. ఇక వచ్చిన అవకాశాన్ని గుడివాడ అమరనాధ్ బాగానే వాడుకున్నారనే చెప్పాలి. ఆయన తన ప్రసంగంలో చెప్పాల్సిన అన్ని విషయాలను స్పష్టంగా చెప్పి అటు సీఎం జగన్ ని ఇటు ఏపీ జనాన్ని కూడా అట్రాక్ట్ చేశారు.

ఆయనేనా ….

విశాఖకే తలమానికం లాంటి స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడాల్సి వస్తే సీనియర్ ఎమ్మెల్యేకు ఆ చాన్స్ ఇస్తారు. అది కూడా కేవలం ఒక్కరు మాత్రమే మాట్లాడాల్సిన పరిమితమైన సమయంలో ఆ ఒక్కరూ గుడివాడ అమరనాధ్ అంటూ జగన్ ఎంచుకున్న తీరుతోనే వైసీపీలో కొత్త లెక్కలు వినిపిస్తున్నాయి. గుడివాడతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పైగా స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాక నియోజకవర్గానికి చెందిన తిప్పల నాగిరెడ్డితో పాటు, పలు మార్లు గెలిచిన సీనియర్లుగా కరణం ధర్మశ్రీ, కన్నబాబురాజు, వంటి వారున్నారు. కానీ గుడివాడే మాట్లాడాలి, ఆయన తో పాటే ఇష్యూ కూడా హైలెట్ కావాలని ఆలోచించిన తీరుతో గుడివాడకు ఇపుడు విషెస్ వరసపెట్టి వచ్చి పడుతున్నాయట.

మంత్రి యోగమే …?

జగన్ గుడ్ లుక్స్ లో గుడివాడ అమరనాధ్ ఉన్నారు అంటున్నారు. నిజానికి తొలి విడతలో ఆయనకు మంత్రి పదవి దక్కాలి. కానీ అవంతి శ్రీనివాస్ బ్యాక్ గ్రౌండ్, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తో విభేదించి పార్టీలో చేరిన వైనం, సీనియర్ నేత లాంటివన్నీ కలసి వచ్చి ఆయన మంత్రి అయిపోయారు. ఇపుడు చూస్తే విస్తరణలో అనేక పేర్లు వినిపిస్తున్నాయి. అయితే మొదటి నుంచి జగన్ కి గుడివాడ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది అంటున్నారు. యువకుడు, రాజకీయ కుటుంబానికి చెందిన వాడు, పక్కా లోకల్, పైగా కాపు సామాజికవర్గానికి చెందిన నేత. విపక్షాన్ని చీల్చి చెండాడే తెగింపు ఇవన్నీ కూడా గుడివాడకు అమాత్య కిరీటం తగిలించేలా ఉన్నాయని చెబుతున్నారు.

తండ్రి తరువాత :

ఇక గుడివాడ అమరనాధ్ తండ్రి గుడివాడ గురునాధనారావు కూడా మొదటిసారి గెలిచిన వెంటనే మంత్రి అయిపోయారు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయి తండ్రి బాటలోనే తనయుడికి కూడా మంత్రి పదవి దక్కేలా ఉందని అంటున్నారు. దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా గుడివాడ కుటుంబం రాజకీయాల్లో ఉంటోంది. ఆయన తాత గుడివాడ అమ్మన్న పెందుర్తి నియోజకవర్గం ఏర్పడినపుడు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత గురునాధరావు ఎమ్మెల్యే అయితే ఇపుడు అమరనాధ్ కూడా వారసత్వాన్ని నిలబెట్టారు అంటున్నారు. మొత్తానికి విస్తరణలో కచ్చితంగా గుడివాడకే చాన్స్ అన్నది తెలుస్తోంది. చివరి నిముషంలో ఏమైనా మార్పు చేర్పులు లేకపోతే మాత్రం గుడివాడే మంత్రి అని రాసేసుకోవచ్చు అని కూడా విశాఖ వైసీపీ నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది.

Tags:    

Similar News