ప్రొఫెసర్ కే ఛాన్స్ ఉందట…?

ప్రొఫెసర్ కోదండరామ్ కు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు పరీక్షగా మారాయి. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టిన కోదండరామ్ కు ఈ ఎన్నికల్లో విజయం వరిస్తుందా? లేదా? అన్న [more]

Update: 2021-03-10 09:30 GMT

ప్రొఫెసర్ కోదండరామ్ కు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు పరీక్షగా మారాయి. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టిన కోదండరామ్ కు ఈ ఎన్నికల్లో విజయం వరిస్తుందా? లేదా? అన్న చర్చ జరుగుతుంది. కానీ కోదండరామ్ కు చివరకు విజయమే లభిస్తుందన్న అంచనాలు అయితే బలంగా ఉన్నాయి. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కోదండరామ్ పోటీ చేస్తున్నారు. ఆయన గత కొంతకాలంగా తనను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు.

ఉద్యమంలో కీలక పాత్ర…..

ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. జేఏసీ ఛైర్మన్ గా ఆయన అన్ని పార్టీలనూ ఒక తాటిపైకి తెచ్చారు. ఉద్యమాన్ని శాంతియుత పద్ధతిలో నడిపి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేందుకు కారణమయ్యారు. అలాంటి కోదండరామ్ ను రాష్ట్రం వచ్చాక అన్ని రాజకీయ పార్టీలూ మోసం చేశాయి. ఉద్యమ సమయంలో ఆయన సేవలను వినియోగించుకుని ఆ తర్వాత టీఆర్ఎస్ కూడా పక్కన పెట్టేసింది.

అందరూ హ్యాండిచ్చినా….?

ఈ ఎన్నికల్లో కోదండరామ్ కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాములు నాయక్ ను బరిలోకి దింపింది. ఇక కమ్యునిస్టు పార్టీలు కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపాయి. దీంతో కోదండరామ్ ఒంటరి అయ్యారన్న సానుభూతి బాగా ఉంది. కోదండరామ్ లాంటి వాళ్లు పెద్దల సభకు వెళితే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. పట్టభద్రుల నియోజకవర్గం కావడంతో కోదండరామ్ కు కొంత అడ్వాంటేజీ ఉంది.

విద్యార్థులంతా ప్రొఫెసర్ వైపే….?

ఇప్పటికే పూర్వ విద్యార్థులంతా రంగంలోకి దిగి కోదండరామ్ కు అండగా నిలుస్తున్నారు. రాజకీయ పార్టీలు హ్యాండిచ్చినా కోదండరామ్ కు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వెన్నుదన్నుగా నిలుస్తామంటున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్ పోటీలో ఉన్నారు. అయితే వీరందరి కన్నా కోదండరామ్ కు గెలుపు అవకాశాలున్నాయని విశ్లేషకుల అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News