ముందుంది కదా…?

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడింది. బీజేపీని ప్రభుత్వఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినా దేవేంద్ర ఫడ్నవిస్ తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. [more]

Update: 2019-11-09 16:30 GMT

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడింది. బీజేపీని ప్రభుత్వఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినా దేవేంద్ర ఫడ్నవిస్ తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ, శివసేనలు రెండూ బెట్టు వీడకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ఇక కష్టతరమేనని పిస్తుంది. ఇప్పుుడ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో భారతీయజనతా పార్టీ, శివసేనలు ఎంత కొట్లాడుకున్నా చివరకు ఒకటవుతారని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలకు విరుద్ధంగా ఎన్నికలకు ముందు వరకూ మిత్రులుగా ఉన్న వారు బద్ధ శత్రువులయ్యారు.

బద్ధ శత్రువులుగా మారి….

ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ, శివసేనల మధ్య కొంత అభిప్రాయ భేదాలున్నప్పటికీ చివరకు ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనుకున్నారు. కానీ పదిహేను రోజులు గడుస్తున్నా కొలిక్కి రాలేదు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేతో సమావేశవుతారని భావించారు. అయితే అమిత్ షా మహారాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ఆసక్తి కనపర్చలేదు. కేవలం దేవేంద్ర ఫడ్నవిస్ తో మాట్లాడి ఊరుకున్నారు తప్పించి శివసేనను కూల్ చేసేందుకు కనీస యత్నం చేయలేదు.

సయోధ్య కుదిర్చేందుకు….

ఇక ఆర్ఎస్ఎస్ కూడా ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా అది కూడా వర్క్ అవుట్ కాలేదు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడుతున్నట్లు తెలిసింది. తమను నమ్మించి మోసాం చేశారని ఆయన పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీతో కలసి నడవాలంటే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటున్నారు. శివసేన అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తానని తన తండ్రి బాల్ థాక్రేకు మాట ఇచ్చానని చెబుతున్నారు.

గవర్నర్ దే తుది నిర్ణయం….

శివసేన ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించింది. దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేయడంతో ఇప్పుుడు మహారాష్ట్ర రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. గవర్నర్ బీజేపీని ఆహ్వానిస్తారా? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? అన్నది గవర్నర్ చేతిలోనే ఉంది.అయితే గవర్నర్ నిర్ణయం తీసుకోవడంతో క్లారిటీ అయితే వచ్చింది. మహారాష్ట్ర రాజకీయాలపై ఇప్పటికే గవర్నర్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్లారంటున్నారు. మొత్తం మీద మహారాష్ట్ర వివాదానికి గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించడంతో మహాారాష్ట్ర రాజకీయం మరెన్ని మలుపులు తిరగనుందో చూడాలి.

Tags:    

Similar News