కరోనాతో పాటు ఇదొక కొత్త సమస్యేనా?

దేశవ్యాప్తంగా వలస కూలీలు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. ఎందరో నిర్భాగ్యులు పిల్లా పాపలతో వివిధ రాష్ట్రాల సరిహద్దుల ముందు మోకరిల్లిన పరిస్థితి దేశంలో ప్రతి [more]

Update: 2020-03-30 16:30 GMT

దేశవ్యాప్తంగా వలస కూలీలు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. ఎందరో నిర్భాగ్యులు పిల్లా పాపలతో వివిధ రాష్ట్రాల సరిహద్దుల ముందు మోకరిల్లిన పరిస్థితి దేశంలో ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింప చేస్తుంది. వీరికి ఆయా రాష్ట్రాలు సమీపంలో ఉండేందుకు వసతి భోజన సదుపాయాలను కల్పిస్తున్నా కొన్ని చోట్ల పర్యవేక్షణ లేక వీరిని పట్టించుకునే వారే లేకుండా పోయారు. పెద్ద పెద్ద సమూహాలుగా సరిహద్దుల్లో తమ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన వీరిపట్ల ఏ మాత్రం అజాగ్రత్త గా వ్యవహరించినా కరోనా కట్టడికి ఇప్పటివరకు తీసుకుంటున్న చర్యలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. రెండో దశ నుంచి కరోనా కట్టడిలో మూడోదశ లోకి భారత్ అడుగుపెడుతున్న నేపథ్యంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ద్వారా వైరస్ విజృంభణకు అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన దేశవ్యాప్తంగా నెలకొనివుంది. విదేశీ మీడియా కూడా వలసకూలీలతో భారత్ ఇక్కట్ల పాలు కానుందనే హెచ్చరికలు జారీ చేసింది.

సవాల్ విసురుతున్న నిరాశ్రయులు …

ఈ పరిస్థితుల్లో వలస కూలీల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాలకు పెను సవాల్ విసురుతుంది. వీరి ఆలనా పాలనా నెల రెండు నెలలు చూడటం అంటే చిన్న విషయం కాదు. అలా అని లాక్ డౌన్ నిబంధనలు ఏమాత్రం సడలించినా ప్రమాదంలో పడతామన్న ఆందోళన అటు సర్కార్ లో కనిపిస్తుంది. దాంతో ఎక్కడివారిని అక్కడే ఉండాలనే రాష్ట్రాలకు దిశా నిర్ధేశం చేసింది. అన్ని రాష్ట్రాల్లో జిల్లా సరిహద్దులు కూడా మూసివేయాలని ఆదేశించింది.

సరిహద్దుల వద్దే…

కేంద్రం. వీరికి భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని సొంత గూటికి వెళతామంటే హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం 14 రోజుల క్వారంటైన్ సరిహద్దుల వద్దే ఏర్పాటు చేసి పంపాలని చెబుతుంది. ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు తలనొప్పి తెప్పిస్తుంది. వీరిని ఏమి చేయాలో ఎలా రక్షణ ఇవ్వాలన్న అంశంపై సర్కార్ కిందా మీదా పడుతుంది ఈ నేపథ్యంలో ఎపి సర్కార్ ఈ సమస్యలు పరిష్కరించడానికి సొంత గూటికి వీరిని చేరేలా చేసి వివరాలు నమోదు చేసుకుని హోమ్ క్వారంటైన్ లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News