అమరాతి రైతుల తక్షణ కర్తవ్యం అదేనా…?

ఏ విషయంలో అయినా పట్టూ విడుపూ ఉండాలి. మరి రెండేళ్లలో వరసగా వచ్చిన రెండు ప్రజా తీర్పులు సంచలనాల‌నే నమోదు చేశాయి. అవి కూడా వైసీపీకి అనుకూలంగా [more]

Update: 2021-03-28 00:30 GMT

ఏ విషయంలో అయినా పట్టూ విడుపూ ఉండాలి. మరి రెండేళ్లలో వరసగా వచ్చిన రెండు ప్రజా తీర్పులు సంచలనాల‌నే నమోదు చేశాయి. అవి కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. దాంతో అమరావతి సృష్టి కర్త చంద్రబాబు బొక్క బోల్తా పడకతప్పలేదు. ఆయన తాజాగా అమరావతిలోఆఖరి పోరాటాన్ని కూడా చేశారు. తన తప్పు లేదని చెప్పుకోవడనికి అన్నట్లుగా గుంటూరు కార్పొరేషన్ని గెలిపించుకుంటే మీకు భావీ బతుకూ అని కూడా తేల్చి చెప్పేశారు. కానీ జరిగింది వేరుగా ఉంది.

సెంటిమెంట్ లేదుగా…?

అది పంచాయతీ ఎన్నికలు అయినా మునిసిపల్ ఎన్నికలు అయినా లేక రెండేళ్ళ క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలు అయినా కూడా జగన్ కే అమరావతి ప్రాంతాల ప్రజలు, రైతులు జై కొట్టారు. ఇక గుంటూరు కార్పొరేషన్,విజయవాడ కార్పొరేషన్ లను అతి భారీ మెజారిటీతో వైసీపీ గెలుచుకుంది అంటే అమరావతి రాజధాని ప్రభావం జనాల్లో లేదనే అనుకోవాలి. కొందరి ఆందోళన అందరి ఉద్యమంగా చూపిస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. ఏపీ జనాలకు ఇప్పటికీ హైదరాబాద్ రాజధానితో ఉన్న సెంటిమెంట్ లో వెయ్యో వంతు అమరావతి మీద లేదు అన్నది కూడా రుజువు అవుతోంది. ఈ విషయంలో జనాలందరినీ ఒక్క మాట మీదకు తేలేకపోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారనే అనాలి.

జగన్ వద్దకే….

ఈ నేపధ్యంలో నాలుగు వందల రోజుల ఆందోళన అయిదు వందల రోజులు అంటూ సినిమా పోస్టర్లు మాదిరిగా ప్రచారం చేసుకోవడం కాదు, అమరావతి రైతులు చేయాల్సినది ఏంటి అన్నది ఆలోచన చేయాలి. జగన్ మూడు రాజధానులు అంటున్నారు కానీ అమరావతి రాజధానికి తరలించడం లేదు. ఉన్న దాంట్లోనే మిగిలిన వారికి వాటా ఇస్తామని చెబుతున్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అందరికీ ఇవ్వాలనే వికేంద్రీకరణ అని జగన్ చెబుతున్నారు. మరి అంతా తమకే రావాలని కావాలని మొండి పట్టు పట్టకుండా ఇప్పటికైనా అమరావతి రైతులు జగన్ వద్దకు చర్చకు వస్తే బాగుంటుంది అన్నది మేధవుల మాటగా ఉంది.

రెడీ అంటున్న సర్కార్…

అమరావతి రైతులు కనుక తమ వద్దకు వస్తే వారి సాధకబాధకాలను తెలుసుకుని తగిన విధంగా న్యాయం చేస్తామని మంత్రి కొడాలి నాని ఇప్పటికే స్పష్టం చేశారు. అమరావతి భూములకు ధరలు పడిపోకుండా తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అంతే కాదు అమరావతిలో అన్ని రకాల ప్రాజెక్టులను కూడా కేటాయించి దాని హోదాకు ఏ మాత్రం భంగం కలగకుండా చూస్తామని చెబుతున్నారు. అందువల్ల ఇకనైనా ఆందోళలనను విరమించి అమరావతి రైతులు వైసీపీ సర్కార్ తో చర్చలు జరిపి భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. మరి వివేచనతో వారు ఆ విధంగా అడుగులు ముందుకు వేయాలని ఏపీ జనాలూ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News