లొంగిపోతాడనుకుంటే.. రాటు దేలిపోయాడే?

గదిలో పెట్టి పిల్లిని బంధిస్తే పులిలా మారుతుంది. గొట్టిపాటి రవికుమార్ విషయంలో అదే నిజమయింది. గొట్టిపాటి రవికుమార్ పై ఎన్ని రకాలు వత్తిడులు తెచ్చారో అది టీడీపీకే [more]

Update: 2021-03-16 13:30 GMT

గదిలో పెట్టి పిల్లిని బంధిస్తే పులిలా మారుతుంది. గొట్టిపాటి రవికుమార్ విషయంలో అదే నిజమయింది. గొట్టిపాటి రవికుమార్ పై ఎన్ని రకాలు వత్తిడులు తెచ్చారో అది టీడీపీకే ప్లస్ గా మారింది. ఇప్పుడు గొట్టిపాటి టీడీపీకి స్ట్రాంగ్ ఎమ్మెల్యేగా మారారు. నిజానికి గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారతారని తొలినాళ్లలో ప్రచారం జరిగింది. వల్లభనేని వంశీ రాకముందే గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారతారని ప్రచారం జరిగింది. నిజానికి రవి కూడా పార్టీ మారితేనే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చారు.

వైసీపీలోకి వెళ్లాలనుకునే…?

గొట్టిపాటి రవికుమార్ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి సన్నిహితుడు. ఇద్దరికి ఆర్థికపరమైన లావాదేవీలున్నాయి. మంత్రి బాలినేని జగన్ కు దగ్గర బంధువు కావడంతో గొట్టిపాటి వైసీపీలోకి వచ్చేస్తారనుకున్నారు. 2014లో వైసీపీ నుంచి అద్దంకి నియోజకవర్గం నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ ఆపరేషన్ ఆకర్ష్ తో టీడీపీ లో చేరిపోయారు. దీంతో జగన్ గొట్టిపాటి రవికుమార్ పై ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఆయన విషయంలో తొలినాళ్లలో కొంత ఆలోచించారంటారు.

వ్యాపారాలపై దాడులతో….

అయితే గొట్టిపాటి రవికుమార్ మైనింగ్ వ్యాపారాలపై దాడులు నిర్వహించడం, వంద కోట్ల జరిమానా విధిచడం, మైనింగ్ వ్యాపారాలను మూసివేయడంతో గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహంతో ఉన్నారు. శిద్ధారాఘవరావుపై కూడా ఇలాంటి రకమైన ఆర్థిక పరమైన వత్తిడులు తేవడంతో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. కానీ గొట్టి పాటి రవికుమార్ విషయంలో వైసీపీ తప్పుడు అంచనా వేసింది. ఆర్థికంగా ఇబ్బందులు పెడితే లొంగుతాడని భావించింది.

రాటుదేలిన గొట్టిపాటి….

కానీ రానురాను గొట్టిపాటి రవికుమార్ రాటుదేలిపోయారు. తగిలిన దెబ్బలు ఎటూ తగిలాయి. ఇక ఎందుకు లొంగాలి అనుకున్నాడో ఏమో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ తన బలాన్ని నిరూపించుకునే యత్నం చేశారు. అధికారంలో లేకపోయినా వైసీపీ అభ్యర్థి చేత నామినేషన్ ఉపసంహరణ చేయించడం చర్చనీయాంశమైంది. వ్యక్తిగతంగా బలంగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ ను భయపెట్టి లొంగదీసుకోలేమన్నది ఇప్పటికైనా వైసీపీకి అర్థమయి ఉండాలి.

Tags:    

Similar News