ఈసారైనా న్యాయం జరుగుతుందా?

పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అయితే ఇప్పటి వరకూ ఆయనను పొలిట్ బ్యూరోలో చంద్రబాబు నియమించలేదు. సీనియర్ నేతగా ఉన్న బుచ్చయ్య [more]

Update: 2020-10-08 05:00 GMT

పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అయితే ఇప్పటి వరకూ ఆయనను పొలిట్ బ్యూరోలో చంద్రబాబు నియమించలేదు. సీనియర్ నేతగా ఉన్న బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు హయాంలో అన్యాయం జరుగుతుందని పార్టీలో అందరూ అంగీకరించే విషయమే. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. అదే సామాజికవర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవులు దక్కుతున్నాయి కాని గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మాత్రం దక్కడం లేదు.

మంత్రివర్గంలోకి…..

ఇది సీనియర్ నేత గోరంట్ల బుచ్యయ్య చౌదరిని కలచి వేేసే అంశమే. ఆయన అనేక సందర్భాల్లో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన ఆయనను పక్కనపెట్టారు. అసెంబ్లీలో పార్టీ గళాన్ని బలంగా వినిపించే బుచ్చయ్య చౌదరిని చంద్రబాబు నిరంతరం నిర్లక్ష్యం చేస్తున్నారన్నది మాత్రం వాస్తవం. కానీ బుచ్చయ్య చౌదరి పార్టీ లైన్ ను ఏనాడూ దాటలేదు. పట్టిన జెండాను వదలలేదు.

సామాజిక వర్గాల సమీకరణలతోనే….

అయితే సీనియర్ నేతల వాదన మరోలా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు. అక్కడి సామాజిక వర్గాల సమీకరణల ప్రకారం బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించలేక పోయారంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కాపులు, ఎస్సీలకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం దక్కుతూ వస్తుందని, అందుకే గోరంట్లకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేకపోయారంటున్నారు.

దూళిపాళ్లను తీసుకోవాలనుకున్నా…..

తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని చంద్రబాబు పొలిట్ బ్యూరోలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇటీవల మాజీమంత్రి గల్లా అరుణకుమారి పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో గోరంట్లను తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులోకి దూళిపాళ్ల నరేంద్రను తొలుత పొలిట్ బ్యూరోకి తీసుకోవాలనుకున్నారు. కానీ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిని సంతృప్తి పర్చేందుకు ఆయనకే ప్రయారిటీ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News