ఇంతకంటే నమ్మకమైన నేత ఉంటారా?

తెలుగుదేశం పార్టీలో అత్యంత నమ్మకమైన నేత ఉన్నారంటే అది గోరంట్ల బుచ్చయ్య చౌదరి అని మాత్రమే. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఉన్నారు. [more]

Update: 2020-07-20 03:30 GMT

తెలుగుదేశం పార్టీలో అత్యంత నమ్మకమైన నేత ఉన్నారంటే అది గోరంట్ల బుచ్చయ్య చౌదరి అని మాత్రమే. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఉన్నారు. కానీ ఎన్టీఆర్ హయాంలో తప్పించి ఆయనకు ఎప్పుడూ మంత్రి పదవి దక్కలేదు. తన నమ్మకాన్ని చంద్రబాబు విశ్వాసంలోకి తీసుకోలేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికీ సన్నిహితుల వద్ద బాధపడుతుంటారు. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 75 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుడిగా ఫుల్ జోష్ లో ఉన్నారు.

వయసుతో నిమిత్తం లేకుండా….

గోరంట్ల బుచయ్య చౌదరి వయసుతో నిమిత్తం లేకుండా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఫేస్ బుక్ లైవ్ లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. కోవిడ్ సందర్భంగా బయటకు వయసు రీత్యా రాలేకపోతున్నా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కార్యకర్తలకు మాత్రం అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఎన్టీఆర్ హయాంలో….

గోరంట్ల బుచ్యయ్య చౌదరిని నాడు ఎన్టీఆర్ గుర్తించి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎంతగా నమ్మేవారంటే… చంద్రబాబు కంటే ఎక్కువ విలువ ఇచ్చేవారు. అప్పట్లో రేణుకా చౌదరికి, గోరంట్ల బుచ్యయ్య చౌదరికి పార్టీలో వివాదం తలెత్తినప్పుడు ఎన్టీఆర్ గోరంట్ల వైపు నిలబడ్డారు. అయితే చంద్రబాబు హయాంలో మాత్రం గోరంట్ల బుచ్చయ్య చౌదరికి న్యాయం దక్కలేదు. గత ప్రభుత్వ హయాంలో ఆయన తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు.

అదే ఆయనకు మైనస్….

గోరంట్ల బుచ్యయ్య చౌదరి ఏదైనా ముఖం మీదనే మాట్లాడే వ్యక్తి. అదే ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతుందని అంటారు. ప్రస్తుతం అధికార పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా ఆయన కన్నతల్లి లాంటి పార్టీకి మోసం చేయలేనని చెప్పడం పార్టీ పట్ల ఆయనకున్న నిబద్దతకు నిదర్శనమని చెప్పకతప్పదు. గోరంట్ల బుచ్యయ్చ చౌదరి లాంటి నమ్మకమైన నేతలు పార్టీకి పదిమంది ఉంటే ప్రస్తుతం ఈ గతి పట్టేది కాదన్నది పార్టీ నేతల నుంచి విన్పిస్తున్న మాట. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్న గోరంట్ల బుచ్యయ్య చౌదరి మాత్రం పార్టీపై తన అభిమానాన్ని మాత్రం వీడలేదు.

Tags:    

Similar News