గోరంట్ల ఎటాక్ మొదలు పెట్టేశారే …?

పార్టీకి రాజీనామా పదవికి రాజీనామా చేసి పారేస్తా అని అధినేత బుజ్జగింపులతో వెనక్కి తగ్గిన రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోష్ లో ఉన్నారు. [more]

Update: 2021-09-06 05:00 GMT

పార్టీకి రాజీనామా పదవికి రాజీనామా చేసి పారేస్తా అని అధినేత బుజ్జగింపులతో వెనక్కి తగ్గిన రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోష్ లో ఉన్నారు. చంద్రబాబు తో భేటీ తరువాత రాజమండ్రి అర్బన్ లో సైతం గోరంట్లకు పట్టు చిక్కినట్లే కనిపిస్తుంది. రెండు నియోజకవర్గాల్లో తన మాటకు విలువ ఇవ్వాలన్నది చిన్నన్న పంతం. దీనికోసం మొత్తానికి పోరాడి అర్బన్ లో హక్కులు సాధించేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తూర్పు టిడిపి లో హాట్ టాపిక్ అయ్యాయి.

ఇంట్లో పార్టీ ఆఫీస్ పెడతారా …?

అధిష్టానం ఆశీస్సులతో అమరావతి నుంచి రాజమండ్రి వచ్చాక గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వరం మారింది. కొన్ని సంవత్సరాలుగా రాజమండ్రి అర్బన్ లో బుచ్చయ్య హడావిడి పెద్దగా ఉండేది కాదు. ఆ విధంగా చేసిన మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని ఇన్నాళ్ళకు నేరుగా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పార్టీ కార్యాలయాన్ని రాజమండ్రి అర్బన్ ఎమ్యెల్యే ఆదిరెడ్డి భవాని తన ఇంట్లో పెట్టడాన్ని బుచ్చయ్య తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ లో ఈ విధమైన పోకడలు నష్టం తెస్తున్నాయని ఇప్పటికైనా ఆ విధానం వారు మార్చుకోవాలని డిమాండ్ చేశారు ఆయన.

గేర్ మార్చేస్తారా …?

ఎంతటి బలమైన శత్రువు ను అయినా తన వాగ్ధాటి తోను, రాజకీయ అనుభవంతో ధీటుగా ఎదుర్కొంటారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 39 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ లో ఉన్న ఆయన గత రెండున్నరేళ్లుగా సొంత పార్టీలో నిరాదరణకు ముఖ్యంగా తాను పెంచి పోషించిన రాజమండ్రి అర్బన్ లో అనామకులే అయిపోయారు. ఇది ఇక ఉపేక్షించి లాభం లేదనుకునే అధిష్టానం తో అమీ తుమీ తేల్చుకునేందుకు ఢీ కొట్టేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ముఖ్యంగా స్థానిక రాజకీయాల నేపథ్యంలో తన ఆధిపత్యం కనీసం రాజమండ్రి లో కూడా లేకుండా పోవడంతో ఒక్కసారి తన సంచలన ప్రకటనతో ప్రకంపనలు సృష్ట్టించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన కోరుకున్న స్వేచ్ఛను హక్కులను చంద్రబాబు ఇచ్చినట్లు స్పష్టం అవుతుంది. దాంతో రాజమండ్రి టిడిపి రాజకీయాలు ఇకపై వాడిగా వేడిగా నడవనున్నాయి. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెర్సెస్ ఆదిరెడ్డి అప్పారావు నడుమ యుద్ధం అంతర్యుద్ధంగా ఉంటుందా లేక బహిరంగంగా నా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News