గోరంట్ల మరి కొన్ని గుట్లు బయటపెడతారటగా …?

చంద్రబాబు పాలన అందరికి గుర్తు ఉండే ఉంటుంది. అధికారుల నుంచి ఎమ్యెల్యేలు, ఎంపీ ల వరకు అందరి రెడ్ ఫైల్స్ ఆయన టేబుల్ దగ్గర సిద్ధంగా ఉంటాయి. [more]

Update: 2021-08-24 06:30 GMT

చంద్రబాబు పాలన అందరికి గుర్తు ఉండే ఉంటుంది. అధికారుల నుంచి ఎమ్యెల్యేలు, ఎంపీ ల వరకు అందరి రెడ్ ఫైల్స్ ఆయన టేబుల్ దగ్గర సిద్ధంగా ఉంటాయి. తేడా వచ్చినప్పుడు నేరుగా వారి జాతకం విప్పుతానని హెచ్చరించడం సాగనంపాలి అంటే తన సొంత మీడియా లో లీక్ ఇచ్చి ప్రచార మాధ్యమాల్లో హోరెత్తించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ విషయంలో టిడిపి స్కూల్ లో చంద్రబాబు కన్నా ముందు వచ్చి చేరిన సీనియర్ రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అందుకే ఆయన చంద్రబాబు తో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

గోరంట్ల రెడ్ ఫైల్ తో సిద్ధంగా ఉన్నారా …?

ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేసే ముందు, చేసిన తరువాత తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాలన్నీ ససాక్ష్యాలతో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వద్ద ఉన్నాయి. చాలా సంఘటనలకు ఆయనే ప్రత్యక్ష సాక్షి కూడా. లక్ష్మీపార్వతి బూచి చూపి చంద్రబాబు పార్టీని తన వైపుకు ఏవిధంగా ఎవరెవరితో తిప్పుకున్నారో ఆయనకు పూర్తిగా తెలుసు. ఎన్టీఆర్ తరువాత పార్టీలో ప్రతీ అంశం తెలిసిన అతి కొద్దిమందిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. అందుకే ఎవరికి పెద్దగా భయపడని చంద్రబాబు బుచ్చయ్య దగ్గరకు వచ్చే సరికి చూసి చూడనట్లే వ్యవహరిస్తూ ఉంటారని టాక్. గుట్టు అంతా తన దగ్గర ఉంచుకున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసెంబ్లీ టికెట్ల అంశంలో తనకు అన్యాయం జరుగుతుందని భావించిన నాడు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చెబుతూ అధిష్టానం తో ఆడుకుంటారని దాంతో బాబు ఆయన టికెట్ కి ఒకే చెప్పడం రివాజు గా వస్తుందని చౌదరి వ్యతిరేకుల మాట.

బాల్ బాబు కోర్ట్ లోకి కొట్టిన బుచ్చయ్య …

ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి పార్టీలో సంక్షోభం సృష్ట్టించారు. అధిష్టానం వైఖరితో విసిగి వేసారి పోయి పదవికి, పార్టీకి రామ్ రామ్ చెప్పేస్తా అంటూ అల్టిమేటం ఇచ్చారు. ఆయన చేస్తానని చెప్పినా ఆ ముహూర్తం వెల్లడించకుండా బాల్ చంద్రబాబు కోర్ట్ లోకి వ్యూహాత్మకంగా కొట్టేశారు. దాంతో అధిష్టానం పైకి కమిటీ ని నియమించి తెరవెనుక ఆయనతో సయోధ్యకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. చంద్రబాబు రెడ్ ఫైల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటివారు బయటపెడితే దానికి క్రెడిబులిటీ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా బాబు జగన్ చేతిలో ఘోరపరాజయం తరువాత సొంత సామాజిక వర్గం లో కూడా సానుభూతి కోల్పోయారు. కొడుకు కోసం పార్టీని దిగజార్చారనే అప్రదిష్ట మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటివారు నోరు విప్పితే అధినేత పై నిప్పులే కురుస్తాయనడంలో సందేహం లేదు. దాంతో త్వరలోనే బుచ్చయ్య సీరియల్ కు ఎండ్ కార్డు కొట్టేయాలని టిడిపి యంత్రాంగంలోని పెద్దలు కృషి చేస్తున్నారు. మరి ఏమి జరగనుందో వేచి చూడాలి.

Tags:    

Similar News