బాబుపై గోరంట్ల బ్రహ్మాస్త్రం … ఉక్కిరి బిక్కిరౌతున్న అధినేత ?

తెలుగుదేశం లో ఎవరికి లభించని అవకాశాలు రాజమండ్రి అర్బన్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి దక్కాయనే చెప్పాలి. పార్టీ ప్రారంభం నుంచి ఆయన ఏ ఎన్నికల్లో టిడిపి [more]

Update: 2021-08-22 12:30 GMT

తెలుగుదేశం లో ఎవరికి లభించని అవకాశాలు రాజమండ్రి అర్బన్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి దక్కాయనే చెప్పాలి. పార్టీ ప్రారంభం నుంచి ఆయన ఏ ఎన్నికల్లో టిడిపి టికెట్ ను మిస్ అవ్వలేదు. ఎన్నిసార్లు ఆయన్ను చంద్రబాబు పక్కకు పెట్టాలనుకున్నప్పటికీ అనివార్యంగా టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితిని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కల్పించారు. దాని ఫలితంగానే మొన్నటి ఎన్నికలతో కలిపి తొమ్మిది సార్లు అసెంబ్లీ టికెట్ గోరంట్లకు దక్కడం ఒక రికార్డ్ గానే చెప్పొచ్చు. అలాంటి గోరంట్ల కు పార్టీనుంచి పోతే కానీ మనశ్శాంతి లభించదన్నంత వేదన ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం తన స్కూల్ నుంచి వచ్చిన ఆదిరెడ్డి కావడం గమనార్హం. అప్పారావు టిడిపి లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారనగానే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డికి చెక్ పెట్టేందుకు ఆయన తోడల్లుడు చల్లా శంకర రావు ను టిడిపి తీర్ధం పుచ్చుకునేలా చేశారు.

చల్లా కు టికెట్ ఇవ్వండని …

రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా శంకర రావు నాడు పనిచేసేవారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆదిరెడ్డి తోడల్లుడు శంకర రావు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన రికార్డ్ ఉంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తో నాడు సమాన ఓట్లను శంకర రావు తెచ్చుకోగలిగారు. గోరంట్ల శంకర రావు లు ఓడిపోయి స్వల్ప ఆధిక్యతతో వీరిద్దరిపై 2009 లో రౌతు సూర్యప్రకాశరావు కాంగ్రెస్ ను గెలిచారు. ఇవన్నీ చంద్రబాబు కు వివరించి మచ్చలేని చల్లా కుటుంబానికి అవకాశం ఇవ్వాలని పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రోత్సహించవద్దని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారని అంటారు . అప్పారావు కు టికెట్ ఇస్తే ఆయన పార్టీలో ఉంటారో పోతారో తెలియదని గత అనుభవాలను బాబు ముందు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉంచారని పార్టీ వర్గాల్లో ప్రచారం. తన తోడల్లుడినే అడ్డుపెట్టి బుచ్చయ్య వేస్తున్న ఎత్తుగడలను చిత్తు చేస్తూ చంద్రబాబు, నారా లోకేష్ లతో గట్టి లాబీయింగ్ చేయడం లో సక్సెస్ అయ్యారు ఆదిరెడ్డి అప్పారావు.

గోరంట్ల నో అన్నా ..

ఎర్రన్నాయుడు కుటుంబం పార్టీ ఆరంభం నుంచి చంద్రబాబు తో ఉండటం ఆదిరెడ్డి కుటుంబానికి అవకాశాలు కల్పించడానికే అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ టికెట్ ను తన కోడలు ఆదిరెడ్డి భవాని కి ఇప్పించి ఆమె గెలవడం లో అప్పారావు గట్టి ప్రణాళికతో పని చేశారు. ఆమె కూడా 30 వేలకు పైగా మెజారిటీ తో వైసిపి హవాను ఎదుర్కొని రెండుసార్లు ఎమ్యెల్యే గా పనిచేసిన అనుభవజ్ఞుడు రౌతు సూర్య ప్రకాశరావు పై గెలిచారు. ఆమె గెలుపు తరువాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ని రాజమండ్రి నియోజకవర్గంలో చెయ్యి కాలు పెట్టకుండా చేయడంలో ఆదిరెడ్డి చాక చక్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి – ఆదిరెడ్డి ఆధిపత్యం కోసం రోడ్డెక్కిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎవరి నియోజకవర్గాలకు వారిని పరిమితం చేసేలా రాజీ చేయడంతో కొంత కాలంగా వివాదాలు సద్దుమణిగేలాగే కనిపించినా నివురు గప్పిన నిప్పులాగే పరిస్థితి కొనసాగింది.

బాబుకు పరిష్కారం కష్టమే…

పార్టీలో తన ప్రభ మసకబారుతు ఉండటంతో ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పుడు బ్రహ్మస్త్రం ప్రయోగానికి సిద్ధం అయ్యారు. తన వర్గం వారిని అర్బన్ లో ఆదిరెడ్డి కుటుంబం పక్కన పెడుతూ ఉండటం పార్టీ పదవుల్లో సైతం వారికి అన్యాయం జరగడం వంటి పరిణామాలు గోరంట్లకు తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయం వైపు నడిపించాయి. ఆయనలో అణచుకున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. చివరికి పార్టీకి పదవికి గుడ్ బై కొట్టేయాలనంత నిర్వేదం ఆవరించింది. ఈ పరిణామం చంద్రబాబు కు సంకటం గా మారింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్లకు తలొగ్గితే ఆదిరెడ్డి కుటుంబం కినుక వహిస్తుంది. ఆదిరెడ్డి చెప్పినడానికే సై అంటే గోరంట్ల తనదారి తాను చూసుకోక తప్పదు. ఇలాంటి తరుణంలో మధ్యే మార్గం కోసం బాబు వెతకాడానికే సంక్షోభ నివారణ టీం కు పని అప్పగించారు. టీం నివేదికను బట్టి చంద్రబాబు అడుగు ఉండొచ్చని తెలుస్తుంది.

Tags:    

Similar News