గోరంట్ల యాక్షన్ తో వారంతా సైలెన్స్ …?

రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇచ్చిన జర్క్ ఆ పార్టీలో ఇప్పట్లో తగ్గేది అయితే కాదు. పార్టీకి రాం [more]

Update: 2021-08-21 11:00 GMT

రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇచ్చిన జర్క్ ఆ పార్టీలో ఇప్పట్లో తగ్గేది అయితే కాదు. పార్టీకి రాం రాం చెప్పేస్తా అన్న చిన్నన్న నిర్ణయం పై తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు ఏపీ అంతా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పార్టీలో కానీ అధికారపార్టీలో కానీ ఏమి జరిగినా స్పందించే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పూర్తిగా కొంతకాలంగా స్తబ్దుగానే ఉంటూ వస్తున్నారు. తూర్పు రాజకీయాలకు టిడిపి లో పెద్ద దిక్కుల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. ఆయన కూడా నారా లోకేష్ స్పీడ్ అందుకున్నాక అన్ని విషయాల్లో అంటి ముట్టనట్లే వ్యవహారాలను నెట్టుకొస్తున్నారు.

జ్యోతుల కూడా దూరంగానే …

యనమల రామకృష్ణుడుతో సమానంగా జగ్గంపేట మాజీ ఎమ్యెల్యే జ్యోతుల నెహ్రు గతంలో స్పీడ్ గా ఉండేవారు. అయితే ఆయన వైసిపి లోకి వెళ్ళి తిరిగి టిడిపి లోకి వచ్చాకా కేవలం ఆయన నియోజకవర్గం వరకే పరిమితం అయ్యారు. ఇటీవల అనారోగ్యం కూడా ఆయన్ను జిల్లా రాజకీయాల్లో చురుగ్గా లేకుండా చేస్తుంది. ఇక గోరంట్ల వంటి సీనియర్ నేతతో సమానమైన నాయకుడు తూర్పులో మరొకరు లేకపోవడం కూడా ఈ వ్యవహారంలో తలదూర్చే సాహసం ఎవరు చేయలేకపోతున్నారు. ఒక్క నిమ్మకాయల చినరాజప్ప మాత్రమే జిల్లాలో ఏమి జరిగినా చంద్రబాబు దూతగా అక్కడ ప్రత్యక్షం అవుతూ పార్టీని గాడిన పెట్టేందుకు నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఆదిరెడ్డి మౌనం …

గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుస్సా కు ప్రధాన కారణమైన మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం తాజా పరిణామాలపై మౌనం దాల్చింది. అధినేతే అన్ని చూసుకుంటారు అనే ధీమాలో ఆ వర్గం వేచి చూస్తుంది. అదీగాక ఇటీవల పార్టీ పదవుల పందేరంలో ఆదిరెడ్డి కుటుంబం వెంట ఉన్న వారికి పదవులు బాగానే దక్కాయి. దాంతో గోరంట్ల వేడి మీద ఉన్నప్పుడు గొంతు పెంచితే మంచిది కాదని అధిష్టానం నుంచి అందిన సమాచారంతో ఎమ్యెల్యే ఆదిరెడ్డి భవాని ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియా ముందు ఈ అంశాలపై చర్చించేందుకు ఆసక్తి చూపడం లేదు.

Tags:    

Similar News