వైసిపి లోకి ముందే షిఫ్ట్ అయిన గోరంట్ల వర్గం?

రాజమండ్రి లో టిడిపి అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తప్ప మరో పేరు వినపడేది కాదు. గోరంట్ల అంటే తెలుగుదేశం అనే అంతా భావించే స్థాయికి ఆయన [more]

Update: 2021-08-21 08:00 GMT

రాజమండ్రి లో టిడిపి అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తప్ప మరో పేరు వినపడేది కాదు. గోరంట్ల అంటే తెలుగుదేశం అనే అంతా భావించే స్థాయికి ఆయన ఎదిగారు. దాదాపు తన 39 ఏళ్ళ రాజకీయ జీవితంలో రాజమండ్రిని టిడిపి కి కంచుకోటగా మార్చిన ఘనత నిస్సందేహంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి దే అని చెప్పాలి. క్షేత్ర స్థాయిలో పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఒకప్పుడు గోరంట్ల గ్రాస్ రూట్ లో ఏర్పాటు చేసిందే.

ఆయనకు ప్రాముఖ్యత…..

అలాంటి టాప్ లీడర్ కు గత ఏడేళ్ళు గా సొంత ఇలాఖాలో మాట చెల్లుబాట కావడం లేదు. దీనికి కారణం మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబ ఆధిపత్యం, వారికి అధిష్టానం ముఖ్యంగా లోకేష్ చల్లని ఆశీస్సులే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భగ్గుమనడానికి దారితీశాయి. అందుకే ఆయనలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అసంతృప్తి తలెత్తింది. రాజకీయాల నుంచే శాశ్వతంగా వైదొలగాలన్న నిర్ణయానికి వచ్చారు.

మూడు సార్లు కార్పొరేషన్ లో గెలుపు …

ఒకటి రెండు సార్లు కాదు రాజమండ్రి కార్పొరేషన్ లో మూడు సార్లు తన వ్యూహంతో తెలుగుదేశం పార్టీకి మేయర్ స్థానం దక్కేలా చేయగలిగారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అయితే కొంత కాలంగా పార్టీలో తనను కాదని ఆదిరెడ్డి వర్గానికి పెరిగిన ప్రాధాన్యతతో బుచ్చయ్య వర్గానికి చెందిన వారు వరుసగా వైసిపి కండువా కప్పేసుకోవడం మొదలు పెట్టారు. వీరిలో గోరంట్ల కు ప్రధాన అనుచరులుగా ఉండే మాజీ కార్పొరేటర్ లు పాలిక శ్రీనివాస్, బెజవాడ రాజ్ కుమార్ జై జగన్ అంటే మరో మాజీ కార్పొరేటర్ కురగంటి సతీష్ జై బిజెపి అని వెళ్ళి పోవడం గమనార్హం.

మరికొందరు వెళ్లేందుకు…

మరికొందరు మాజీ కార్పొరేటర్ లు కూడా వైసిపి లో సీటు ఒకే అంటే వెళ్ళెందుకు సై అనేలాగే ఉన్నారు. ఇంకొందరు మాజీ కార్పొరేటర్ లు క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇవన్నీ గోరంట్ల బుచ్చయ్య చౌదరికు పార్టీలో ప్రయారిటీ తగ్గడం ఒక కారణం అయితే ఆదిరెడ్డి అప్పారావు వర్గం తో ప్రయాణం చేయలేక జరుగుతున్న పరిణామాలు గా పసుపు పార్టీలో టాక్.

Tags:    

Similar News