చిన్నన్న సైలెంట్ ? వైలెంట్ అవుతారా?

ఎవరు ఏమనుకున్నా నాకేంటి ? ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఆయనది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరిగే తప్పులను ఎత్తిచూపడంలో ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన [more]

Update: 2019-08-19 03:30 GMT

ఎవరు ఏమనుకున్నా నాకేంటి ? ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఆయనది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరిగే తప్పులను ఎత్తిచూపడంలో ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎప్పుడు వెనక్కి తగ్గింది లేదు. టిడిపి లో చంద్రబాబు కన్నా సీనియర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల పార్టీ వేదికపై చేసిన హాట్ కామెంట్స్ వెనుక చాలా రీజన్స్ ఉన్నాయని పసుపు దళంలో వినిపిస్తున్నాయి. వయోభారం రీత్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఓపిక ఎలాగూ అయిపోతుంది. ఇప్పటికే మోకాళ్ళకు రెండు సార్లు సర్జరీ చేయించుకున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గతంలోలా చురుగ్గా ఉండలేకపోతున్నారు. ఆశించిన ప్రతీసారి అధిష్టానం పదవుల విషయంలో మొండి చెయ్యి చూపిస్తూనే వస్తుంది. ఇక ఎన్నాళ్ళు ఇలా. ఇదే లాస్ట్ ఛాన్స్ అన్న విషయం గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తెలుసు. ఈ నేపథ్యంలో మనసులో వున్న అసంతృప్తి బయటకు చెప్పకపోతే పార్టీ తన ధోరణిలో తాను పోతుందన్న ఆందోళనతో నోరు విప్పారుట గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

డిప్యూటీ లీడర్ గా గుర్తింపు లేదు …

పార్టీకి దశాబ్దాల తరబడి సేవ చేస్తున్నా తన సీనియారిటీకి తగిన గౌరవం ఇచ్చి సముచిత పదవులు ఇవ్వకుండా దూరం పెట్టడాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహించలేక పోతున్నారు. ముఖ్యంగా గతంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, పౌరసరఫరాల శాఖా మంత్రిగా పనిచేసిన ఆయన తన అనుభవాన్ని పార్టీకోసం వినియోగించాలని భావించారు. అయితే చంద్రబాబు తన కోటరీ ముఖ్యులకు మాత్రమే పదవులు కట్టబెట్టడాన్ని ఆయన తట్టుకోలేక పోతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సన్నిహితుల మాట. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తిని గమనించిన చంద్రబాబు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎంపిక చేశారు. అయితే అక్కడా ఆయనకు సముచిత గౌరవం లభించడం లేదు. శాసన సభలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు లకు ఇస్తున్న అవకాశాల్లో సగం కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి దక్కక పోవడంతో బాటు చంద్రబాబు తన పట్ల వహిస్తున్న నిర్లిప్తత మీ బుచ్చయ్య తట్టుకోలేక ఇచ్చిన పదవి ఉంటే ఎంత పోతే ఎంత అనే స్థాయిలో డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

అయినా డోంట్ కేర్ గా …

గత 2014 ఎన్నికలకు ముందు నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి బిజెపి తో పొత్తును వ్యతిరేకిస్తూ గట్టిగానే గళం వినిపించారు. అయినా బాబు ఆయన మాట పెడచెవిన పెట్టారు. ఆ తరువాత ఎన్నికలకు ముందు అధిష్టానంపై ఒకరకమైన తిరుగుబాటు జండా ఎగురవేశారు. పార్టీ ఫిరాయించిన వారికి అందలం ఎక్కిస్తే నిండా మునిగిపోతామని పదేపదే హెచ్చరించారు. దాన్ని లైట్ తీసుకున్నారు చంద్రబాబు. తాజాగా ఇప్పుడు కూడా తన ఫ్లోర్ లెదర్ పదవికి రాజీనామా చేస్తానని బిసి లకు ఇవ్వండి అంటూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ సంచలన ప్రకటన చేశారు. దీన్ని కూడా బాబు డోంట్ కేర్ అనకుండానే పట్టించుకున్నదే లేదు. ఎన్నికల్లో పరాజయం పై పార్టీలో ఏది ఆత్మవిమర్శ అంటూ కూడా తన ఫేస్ బుక్ లో లిఖితపూర్వకంగా పోస్ట్ చేసినా దానిపైనా చర్చ జరిగింది లేదు. ఇలా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గరం గరం అవుతున్నా బాబు మాత్రం కూల్ కూల్ గా ఉండటం వెనుక పార్టీ లోని యనమల వంటి సీనియర్లు సలహాలే కారణమని టాక్ నడుస్తుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అలా వదిలేయడమే బెటర్ అని లేనిపోని చర్చలు పెట్టడం మంచిది కాదన్న సూచనలే చిన్నన్న గగ్గోలు పెట్టినా నో కామెంట్ కి కారణం అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో గోరంట్ల సైలెంట్ అవుతారా ? లేక రాబోయే రోజుల్లో మరింత వైలెంట్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News