అక్కసంతా ఆయనపైనేగా

టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపుడుతున్నారు. ఆయన కొందరి నేతలను తెల్ల ఏనుగులతో పోల్చారు. అంతేకాదు [more]

Update: 2019-08-13 08:00 GMT

టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపుడుతున్నారు. ఆయన కొందరి నేతలను తెల్ల ఏనుగులతో పోల్చారు. అంతేకాదు ఆయన అక్కసు అంతా పయ్యావుల కేశవ్ మీదనేనని అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీలో బహిరంగంగా అసంతృప్తి గళాన్ని విన్పించే వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడూ ఆయన కండువాను మార్చకుండా నమ్ముకునే ఉన్నారు.

అసంతృప్తితో…

కానీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరికి పార్టీ అధిష్టానంపై చాలా అసంతృప్తి ఉంది. గతంలోనూ ఆయనకు మంత్రి పదవి దక్కనప్పుడు చంద్రబాబుపైనే కామెంట్స్ చేశారు. క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన నాటి నుంచి పార్టీలో కొనసాగుతున్న బుచ్చయ్య చౌదరి నలుగురు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని నేరుగా తప్పు పట్టారు. దానివల్ల పార్టీ కార్యకర్తల ఆత్మస్థయిర్యం దెబ్బతింటుందని చెప్పారు.

పరోక్ష విసుర్లు పయ్యావులపైనే….

ఇటీవల జరిగిన ఎన్నికల్లో అంత జగన్ గాలిలోనూ బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. ఆయన శాసనసభలో పార్టీ ఉపనేతగా కొనసాగుతున్నారు. అయితే ఆయన తాజాగా పార్టీ ఉపనేత పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా చంద్రబాబునాయుడు పయ్యావుల కేశవ్ పేరును ఖరారు చేశారు. కేబినెట్ హోదా ఉన్న పదవి కావడంతో దానిపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి మనసు పారేసుకున్నారు. కానీ అది దక్కకపోవడంతో పరోక్షంగా పయ్యావులను టార్గెట్ చేసినట్లు కన్పిస్తుంది.

తెల్ల ఏనుగులు ఎవరు…?

ఓటమికి గల కారణాలను చంద్రబాబు వెతుక్కుంటున్న సమయంలో బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కాక రేపుతున్నాయి. తెల్ల ఏనుగులను పక్కన పెట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు ఐదారుసార్లు ఓడిన నేతలకు ప్రాధాన్యత ఎందుకని ప్రశ్నించారు. తాను ఉపనేతగా రాజీనామా చేస్తానని, ఆ పదవిని ఒక బీసీకి ఇవ్వాలని ఆయన సలహాకూడా ఇచ్చారు. తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని కూడా స్పష్టం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీలో సీనియర్లను పక్కన పెట్టాల్సిందేనని తెలిపారు. ఒక రకంగా యనమలను ఉద్దేశించి కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. మరి గోరంట్ల గరంగరంగా చేసిన కామెంట్స్ అధినేత చెవికి ఎక్కుతాయో? లేదో? చూడాలి.

Tags:    

Similar News