పాపం బాబూరావు…?

వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు బాధ ఎవరికీ చెప్పుకోలేనిది. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, వైఎస్ కుటుంబంతో ఆత్మీయ అనుబంధం ఉన్నప్పటికీ గొల్ల బాబూరావును పూచికపుల్లతో సమానంగా [more]

Update: 2019-12-06 11:00 GMT

వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు బాధ ఎవరికీ చెప్పుకోలేనిది. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, వైఎస్ కుటుంబంతో ఆత్మీయ అనుబంధం ఉన్నప్పటికీ గొల్ల బాబూరావును పూచికపుల్లతో సమానంగా తీసేస్తున్నారట. ఆయన తన మనసులో బాధను ఎవరికి చెప్పుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన జగన్ ను నేరుగా కలసి వివరించదలుచుకున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి గొల్ల బాబూరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

వైఎస్ కుటుంబానికి….

గొల్ల బాబూరావు తొలి నుంచి కాంగ్రెస్ లో ఉండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఎనలేని గౌరవం. వైఎస్ మరణం తర్వాత జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి గొల్ల బాబూరావు చేరారు. 2014 ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ ఇవ్వడంతో ఆయన ఓటమి పాలయ్యారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో గొల్ల బాబూరావుకు పాయకరావు పేట టిక్కెట్ ఇవ్వడంతో అక్కడ విజయం సాధించారు. జగన్ తొలి కేబినెట్ లోనే గొల్లబాబూరావుకు చోటు దక్కుతుందని భావించారు. అయితే కొన్ని సమీకరణాల కారణంగా గొల్ల బాబూరావుకు తొలి కేబినెట్ లో స్థానం దక్కలేదు.

రాజుగారి పెత్తనంతో….

అయితే పాయకరావుపేటలో ఎమ్మెల్యే బాబూరావుపై ఒక రాజుగారు పెత్తనం చేస్తున్నారు. వైసీపీ నేత జోగి జగన్నాధ సూర్యనారాయణరాజు అలియాస్ దత్తుడు బాబు చెప్పిందే పాయకరావుపేటలో వేదంగా నడుస్తుంది. రేషన్ కార్డు నుంచి కాంట్రాక్టుల వరకు దత్తుడు బాబు చెప్పిన వారికే అందుతున్నాయి. అధికారులు సయితం రాజుగారు చెప్పినట్లే నడుచుకోవడంతో ఎమ్మెల్యే బాబూరావు ఇటీవల తన సన్నిహితుల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. బాబూారావుకు జగన్ టీటీడీ మెంబర్ గా కూడా అవకాశం కల్పించారు.

అంతా ఆయనే….

చివరకు టీటీడీ సిఫార్సు లేఖలు కూడా దత్తుడు బాబు చేతులు మీదుగానే ప్రజలకు అందుతున్నాయి. ఎమ్మెల్కే బాబూరావు లెటర్ హెడ్ లన్నీ రాజుగారి వద్దే ఉండటం విశేషం. ఇటీవల పోలవరం కుడి కాల్వ కాంట్రాక్టులో సబ్ కాంట్రాక్లు పనులను కూడా రాజు గారు చెప్పిన వారికే ఇచ్చారన్న వాదన విన్పిస్తుంది. ఇక ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరిగితే వేదిక మీద బాబూరావుకు చోటు దక్కినా ప్రాముఖ్యత అంతా ఆయనకే ఇస్తున్నారు. వేదికపై ఫొటోల విషయంలో కూడా బాబూరావు ఫొటో చిన్నదిగా పెట్టి, రాజుగారి ఫొటో పెద్దదిగా పెడుతుండటంతో ఆయన ఆవేదన అంతా ఇంతా కాదు. ఎస్సీ, ఎస్టీ నియోకవర్గాల్లో గత ప్రభుత్వంలోనూ అగ్రకుల నాయకులదే పెత్తనం. ఇప్పుడు జగన్ హయాంలో కూడా అదే జరుగుతుంది. మరి బాబూరావు బాధను ఎవరు తీరుస్తారో చూడాలి.

Tags:    

Similar News