గంగ‌రాజు వార‌సుడుకి టార్గెట్ ఇదే.. లేదంటే ఇబ్బందే మరి

రాజ‌కీయాల్లో దాదాపు అయాచితంగా వ‌చ్చిన వారు ఉండ‌ర‌ని అంటారు. ఎంతో కొంత వ‌ర్కవుట్ చేస్తేనే పాలిటిక్స్‌లోకి అడుగు పె ట్టడ‌మో.. లేదా పాలిటిక్స్ చేయ‌డ‌మో ఉంటుంది. అయితే, [more]

Update: 2020-05-12 05:00 GMT

రాజ‌కీయాల్లో దాదాపు అయాచితంగా వ‌చ్చిన వారు ఉండ‌ర‌ని అంటారు. ఎంతో కొంత వ‌ర్కవుట్ చేస్తేనే పాలిటిక్స్‌లోకి అడుగు పె ట్టడ‌మో.. లేదా పాలిటిక్స్ చేయ‌డ‌మో ఉంటుంది. అయితే, దీనికి భిన్నంగా.. అప్పటి వ‌ర‌కు అస‌లు రాజ‌కీయాలంటేనే తెలయని వ్యక్తి ఒక్కసారిగా రాజ‌కీయాల్లోకి రావ‌డం, కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో బాధ్యత‌లు చేప‌ట్టడం వంటివి జ‌రిగితే.. ఒకింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే న‌ర‌సాపురంలో జ‌రిగింది. బీజేపీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు కుమారుడు రంగ‌రాజు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. నిజానికి తండ్రి గంగ‌రాజు పారిశ్రామికంగానే కాకుండా రాజ‌కీయంగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే, తండ్రి అధికారంలో ఉన్న స‌మ‌యంలో కానీ, త‌ర్వాత కానీ ఆయ‌న కుమారుడు రంగరాజు ఎక్కడా క‌నిపించింది లేదు.

ఆరు నెలల క్రితం చేరినా…

నిజానికి ఇప్పుడు ఇంట్లో ఒక్కరు రాజ‌కీయంగా ఎదిగితే.. మిగిలిన కుటుంబ స‌భ్యులు చ‌క్రం తిప్పుతున్న ప‌రిస్థితి ఉంది. కానీ, దీనికి భిన్నంగా రంగ‌రాజు ఏనాడూ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోలేదు. అయితే, అనూహ్యంగా ఆరు మాసాల కింద‌ట ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి వైసీపీ ప‌రంగా ఉంటే.. రెండు గంగ‌రాజు ప‌రంగా ఉంది. అనుమ‌తులు లేని భ‌వ‌నాలు, న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో నిర్మించిన భ‌వ‌నాలు కూల్చేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే కృష్ణా న‌ది క‌ర‌క‌ట్టపై గుంటూరు జిల్లాలో నిర్మించిన గంగ‌రాజు భ‌వ‌నం కూడా కూల్చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. దీంతో వైసీపీని మ‌చ్చిక చేసుకోవాల్సిన అవ‌స‌రం గంగ‌రాజుకు ఏర్పడింది.

వైసీపీ అవసరం కూడా….

అయితే, ఆయ‌న బీజేపీలోనే ఉన్నారు కాబ‌ట్టి.. ఆ పార్టీని వీడి వ‌చ్చే ఉద్దేశం లేదు కాబ‌ట్టి అప్పటి వ‌ర‌కు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నప్పటికీ కుమారుడు రంగ‌రాజును వైసీపీలోకి పంపార‌న్నది అంద‌రికి ఉన్న అభిప్రాయం. ఇక‌, అదే స‌మ‌యంలో యాధృచ్చికంగా న‌ర‌సాపురం నుంచి ఎంపీగా గెలిచిన ర‌ఘురామ‌కృష్ణరాజు సొంత పార్టీ వైసీపీని ఇరుకున పెట్టే ప్రయ‌త్నం చేశారు. ఒక‌సారి పిలిచి వార్నింగ్ ఇచ్చినా.. జ‌గ‌న్ మాట‌ను బేఖాత‌రు చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఇక్కడ ర‌ఘుకు చెక్ పెట్టేందుకు బల‌మైన నాయ‌కుడుని రంగంలోకి దింపాల‌ని భావించింది. ఈ క్రమంలోనే రంగ‌రాజును పార్టీలోకి ఆహ్వానించింది. అంతేకాదు, వ‌చ్చీరావ‌డంతోనే కీల‌క‌మైన న‌ర‌సాపురం ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వయ‌క‌ర్త బాధ్యత‌లు అప్పగించింది. ఇలా రంగ‌రాజుకు యాదృచ్చికంగా రాజ‌కీయాలు దరి చేరాయి.

రెండు లక్ష్యాలు….

అయితే, రాజ‌కీయాల‌కు రంగ‌రాజు కొత్త. కానీ, న‌ర‌సాపురం రాజ‌కీయాలు చాలా భిన్నం. పైగా సొంత పార్టీ ఎంపీకే చెక్ పెట్టాలి. అదే స‌మ‌యంలో న‌ర‌సాపురం పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప్రాంతంలో బ‌లంగా ఉన్న జ‌న‌సేన ప్రభావాన్ని త‌గ్గించాలి. ఇక‌, పార్టీలో క్షత్రియుల‌ను క‌లుపుకొని పోవాలి. స‌మ‌న్వయ‌క‌ర్తల‌తో క‌లిసి ప‌నిచేయాలి. మొత్తంగా రంగ‌రాజు ముందు చాలా టార్గెట్‌లు ఉన్నాయి. కానీ, ఆయ‌న నెమ్మదిగా ప‌నిచేస్తున్నార‌ని, ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి వ్యూహం అనుస‌రించ‌లేదని స్థానిక నేత‌లు అప్పుడే ఆయ‌న‌పై ఫిర్యాదులు చేస్తున్నాయి. ఆయ‌న దూకుడు ప్రద‌ర్శించి.. జ‌న‌సేన‌కు, ర‌ఘుకు క‌ళ్లెం వేయ‌గ‌లిగి జ‌గ‌న్ ద‌గ్గర మార్కులు సంపాయించుకుంటేనే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయన‌కు ఉండి నియోజ‌క‌వ‌ర్గం అసెంబ్లీ లేదా న‌ర‌సాపురం ఎంపీ టికెట్ ల‌భించే అవ‌కాశం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. కాబ‌ట్టి.. రంగ‌రాజు.. ఇప్పటికైనా దూకుడుగా వ్యవ‌హ‌రించాల‌ని ఆయ‌న సానుభూతిప‌రులు కోరుతున్నారు.

Tags:    

Similar News