అంత సెంటిమెంటా?

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామస్థులు రాయల్ వశిష్ఠ బోటు బయటకు వచ్చేవరకు హడలిపోతూనే వున్నారు. భయమంటే ఏమిటో తెలియనివారికి ఘోర బోటు ప్రమాదం నిద్రలేని [more]

Update: 2019-10-23 09:30 GMT

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామస్థులు రాయల్ వశిష్ఠ బోటు బయటకు వచ్చేవరకు హడలిపోతూనే వున్నారు. భయమంటే ఏమిటో తెలియనివారికి ఘోర బోటు ప్రమాదం నిద్రలేని రాత్రులనే మిగిల్చింది. కళ్ళముందే 51 మంది బోటు తో సహా జలసమాధి అయిన జ్ఞాపకం వారిని నేటి వరకు వెన్నాడుతూనే వుంది. వారంతా గిరిపుత్రులు, గంగ పుత్రులు. నిత్యం అడవిలో వేటకు వెళ్ళడం, లేదా గోదావరిలో మత్స్య సంపదను వేటాడి కుటుంబాన్ని పోషించుకోవడం వారి జీవన శైలి. అలాంటి జీవనం పూర్తిగా మారిపోయింది.

వేటకు వెళ్లడం మానేసి….

చేపల వేటకు వెళ్ళడం మానేశారు. చివరికి నిత్యం తాగే గోదావరి నీటిని తాగడం కూడా వదిలేశారు. అంటే ఏ స్థాయిలో ఈ ప్రమాదం వారిని ప్రభావితం చేసిందన్నది అర్ధం అవుతుంది. సెంటిమెంట్లు, మూఢనమ్మకాలు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణం. చనిపోయిన వారి ఆత్మలు తమ ప్రాంతంలో తిరుగుతున్నాయనే ఆలోచనలు వారిని నీరు కూడా ముట్టనీయలేదు.

తాము సాధారణ స్థితికి వస్తాం….

కచ్చులూరు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 26 మందిని ప్రాణాలకు తెగించి కాపాడారు. ఆరులక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంలోకి దూకి చావుకు తెగించి మరీ రక్షించి మానవత్వానికి నిర్వచనం గా నిలిచారు. కొందరిని కాపాడగలిగాం అనే సంతృప్తి ఎలా వున్నా కళ్ళముందే అనేకమంది జలసమాధి కావడం వారిలో 38 మంది మృత దేహాలు మాత్రమే లభించడం మరో 13 మంది నదీ గర్భంలో బోటులో నిర్జీవులుగా వున్న నిజం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దాంతో నిత్యం ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతంలోనే వుంటూ కళ్లుకాయలు కాచేలా బోటు బయటకు రావాలని మృతుల బంధువుల్లానే ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి ఆశ ఫలించి సత్యం బృందం విశాఖ డైవర్ల బృందం ఆపరేషన్ సక్సెస్ చేసింది. అది చూసిన తరువాత విషాదకర సంఘటనే అయినా గల్లంతు అయిన వారి ఆచూకీ లభించడంతో ఇక తమదైనందిన చర్యల్లోకి దిగుతామని ప్రకటించారు. చేపల వేటను కొనసాగించేందుకు ఇప్పుడు భయం లేదని వారు చెప్పడం విశేషం.

Tags:    

Similar News