గోవా లో ఈసారి గట్టెక్కుతారటగా?

గోవాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు సన్నద్ధమయ్యాయి. కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా [more]

Update: 2021-04-30 18:29 GMT

గోవాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు సన్నద్ధమయ్యాయి. కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, ఫార్వార్డ్ పార్టీ లు కూడా బరిలో నిలవనున్నాయి. కాంగ్రెస్ గత ఎన్నికలలో మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ అధికారాన్ని చేజిక్కించుకోలేక పోయింది.

గత ఎన్నికల్లో….

2017 మార్చి నెలలో గోవా ఎన్నికలు జరిగాయి. గోవా అసెంబ్లీలో మొత్తం 40 నియోజకవర్గాలున్నాయి. 16 ఇక్కడ మ్యాజిక్ ఫిగర్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 16 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే తాము అధికారంలోకి రావాల్సి ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల మద్దతును సంపాదించుకోలేకపోయింది. అదే సమయంలో బీజేపీ గోవాను చేజిక్కించుకుంది. కేవలం 14 స్థానాల్లో మాత్రమే గెలిచిన బీజేపీ మహరాష్ట్ర గోమంతక్ పార్టీ, ఫార్వార్డ్ పార్టీ, ఇండిపెండెంట్ సభ్యుల మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకుంది.

బీజేపీపై అసంతృప్తి…..

ఈసారి కూడా కాంగ్రెస్ కే ఎక్కువ అవకాశాలున్నాయని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. పారికర్ లేని లోటు కన్పిస్తుందంటున్నారు. గత ఎన్నికలలో గోవాలో ప్రభావం చూపని ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి 40 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించింది. మహారాష్ట్ర రాజకీయాల ప్రభావం కూడా గోవా ఎన్నికలపై ఉండనుంది. కాంగ్రెస్ సభ్యులను తన పార్టీలో కలిపేసుకోవడంతో ఇక్కడ ప్రజలు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

ఇప్పటి నుంచే కసరత్తు….

గోవాలో గట్టెక్కడానికి రాహుల్ గాంధీ ఈసారి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. గత ఎన్నికల్లో జరగనున్న తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తిగా దగ్గరుండి చూసుకుంటున్నారు. చిన్న రాష్ట్రమైనా ఈసారి గోవాను పట్టేయాలన్నది కాంగ్రెస్ లక్ష్యంగా ఉంది. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకుని ఈసారైనా గోవాలో కాంగ్రెస్ నెగ్గుకు రాగలదా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News